రాష్ట్రీయం

మహబూబ్‌నగర్ జిల్లాలో.. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 12: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో జరగనున్న రెండు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. శనివారం నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయగా ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎంపిటిసిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల కరుణాకర్, కటకం శ్రీనివాసచారి తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంకిషన్‌కు ఉపసంహరణ పత్రాలను అందజేశారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార తెరాస నుండి సుంకిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టిడిపి అభ్యర్థిగా కొత్తకోట దయాకర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా జగదీశ్వర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంకిషన్ సాయంత్రం పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.