కృష్ణ

అట్టహాసంగా బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, డిసెంబర్ 5: బెంజిసర్కిల్ వద్ద నూతనంగా నిర్మించనున్న ఫ్లైఓవర్, విజయవాడ, మచిలీపట్నం 64 కిలోమీటర్ల 4 లైన్ల రహదారి విస్తరణ పనులకు శనివారం ఉదయం కేంద్ర రోడ్లు రవాణా, రహదారులు, నౌకయాన శాఖమాత్యులు నితిన్ గడ్కరి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రపట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు వెంకయ్యనాయుడు శంకుస్థాపన శిలఫలకాన్ని ఆవిష్కరించారు. శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతి భూగర్భ శాస్త్ర సహాయ శాఖామాత్యులు యలమంచిలి సుజనచౌదరి, రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చిన్నరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, సిద్దా రాఘవరావు, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) మంచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కొనకొళ్ల నారాయణ, పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామమోహన్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, శాసనమండలి సభ్యులు యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్, మేయర్ కోనేరు శ్రీ్ధర్, జాతీయ రహదారుల సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ టెక్నికల్ కె.వెంకటరమణ, రీజినల్ ఆఫీసర్ జెసిఎస్ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ టి.సురేష్‌కుమార్, జిల్లా కలెక్టర్ బాబు ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్‌హెచ్ 65 రోడ్డు శంకుస్థాపన శిలాఫలకం కార్యక్రమాన్ని జాతీయ రహదారుల ప్రాదికారిక సంస్థ అధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. అయితే నవ్యాంధ్ర అమరావతి రాజధాని నిర్మాణం నేపథ్యంలో విపరీతంగా పెరగనున్న భవిష్యత్ ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టకొని బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌ను నిర్మలా కానె్వంటు జంక్షన్ వరకే కాకుండా రామవరప్పాడు, గన్నవరం విమానశ్రయం వరకు పొడిగిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తవని శంకుస్థాపన శిలాఫలకం కార్యక్రమానికి హాజరైన నగర ప్రముఖులు, ప్రజలు చర్చించుకోవటం జరిగింది.

శ్రీకనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జిగా నామకరణం
ఇంద్రకీలాద్రి,డిసెంబర్ 5: కుమ్మరి పాలెం సెంటర్ నుండి నగరపాలక సంస్థ వరకు రూ.447కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జికి ‘శ్రీకనకదుర్గ ఫ్లైఓవర్’గా నామకరణం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం ఉదయం కుమ్మరి పాలెం సెంటర్‌లో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో అమ్మవారి పేరును హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఒక సామాజిక వర్గం డిమాండ్ చేస్తున్న తరుణంలో వారికి పోటీగా మరొక సామాజిక వర్గం కూడా ముగ్గురు నేతల్లో ఒకరి పేరైనా పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఎవరి పేరు పెట్టాలనే తర్జన భర్జనల నడుమ కొంత మేరకు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో నూతన రాజధాని నిర్మాణానికి కలియుగ ప్రత్యేక దైవం శ్రీకనకదుర్గమ్మ ఆశీస్సులను ఇవ్వాలని ఆమెను ప్రసన్నం చేసుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెరపైకి వస్తున్న అన్ని వాదనలను తోచిపుచ్చి అఖిలాండకోటి బ్రహ్మండ నాయికి శ్రీకనకదుర్గమ్మ పేరు పెట్టటంతో ఈ వివాదానికి తెరపడింది.

కలెక్టర్ బాబు ఎ టీంను ప్రశంసించిన కేంద్ర ఆర్ అండ్ బి సిఇ అశోక్ ప్రశంస
* 2016 జూలై 16 నాటికి దుర్గ ఫ్లైఓవర్ పూర్తికి సంపూర్ణ సహకారాలు
విజయవాడ, డిసెంబర్ 5: చేయగలమనే ధీమా.. చేయాలనే ధృక్పథం... చేసి చూపించగలమనే సంకల్పం గల టీం కృష్ణా పనితీరు తనని ముగ్ధుడిని చేసిందని రోడ్లు భవనాల కేంద్ర మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంజనీర్ అశోక్ కుమార్ నాగ్ పాల్ అన్నారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి శ్యాంబాబు ఆధ్వర్యంలో దుర్గా ఫ్లైఓవర్ ఇతర జాతీయ రహదారుల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగ్‌పాల్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో పనిచేసే సమయంలో బ్యూరోక్రసీ విధానాన్ని విడనాడి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడంలో ఒక కాలపరిమితిని నిర్దేశించుకుని పని పూర్తి చేయాలనే సంకల్పం టీం కృష్ణా అధికారులలో కన్పించిందన్నారు. దుర్గా ఫ్లైఓవర్ పనులకు సంబంధించి పరిపాలనపరమైన ఆమోదానికి ప్రతిపాదనలు పంపుతూ నవంబర్ చివరి నాటికి భూములను కంపెనీ వారికి అందుబాటులోకి తీసుకువస్తానని, పనులకు ఎటువంటి ఆటంకం జరుగకుండా సహకారం అందిస్తామని, జిల్లా యంత్రాంగం ఇచ్చిన హామీని చేసి చూపించడం జరిగిందన్నారు. ఇదే విధానంలో ఏ ప్రాంతంలోను భూములు అప్పగించిన దాఖలాలు తన సర్వీసులో చూడలేదన్నారు. 2016 జూలై 16 నాటికల్లా దుర్గా ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసేందుకు సోమా కంపెనీ యాజమాన్యం ఒక నిర్థిష్టమైన ప్రణాళికలను రూపొందించి కలెక్టర్ బాబు ఎకు అందజేయాలని పేర్కొన్నారు.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శ్యాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన అమరావతి ప్రాంతంలో దుర్గా ఫ్లైఓవర్ పనులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పుష్కరాల నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ దుర్గా ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం కోసం కాస్టింగ్ యార్డును 2 రోజులలో కంపెనీ వారికి అందిస్తామని, అదే సమయంలో నగరంలో మంచినీటి పైప్ లైన్ల నిర్మాణంలో 24 గంటలకు క్షేత్రస్థాయి పనుల పర్యవేక్షంలో దిగువ స్థాయి సిబ్బంది నుండి జిల్లా ఉన్నత స్థాయి అధికారి వరకు టీం కృష్ణాగా కలిసి ముందుకు వెళుతున్నామన్నారు.
సోమా కంపెనీ డైరెక్టర్ డివి రాజు మాట్లాడుతూ, ప్రణాళికల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, టీం కృష్ణా భూసేకరణ ద్వారా చేపట్టిన పనులను అభినందించి తీరాలని పేర్కొన్నారు. సోమా డైరెక్టర్ వై.రాఘవేంద్ర మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో సహహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల సిజియం న్యూఢిల్లీ కె వెంకట రమణ, సిజియం హైదరాబాదు జెసిఎస్ రెడ్డి, కేంద్ర ఆర్ అండ్ బి సిఇ పి.సుబ్బరాయ శర్మ, ఎన్‌హెచ్ పిడి సురేష్ కుమార్, సోమా ప్రాజెక్టు మేనేజరు సురేష్, ఎస్‌ఇ మెషే తదితరులు పాల్గొన్నారు.

విజయవంతంగా పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు
బెంజిసర్కిల్, డిసెంబర్ 5: ప్రముఖ సినీనటి సమంత ఆధ్వర్యంలోని ప్రత్యూ ష సపోర్ట్ సంస్థ సహకారంతో విజయవంతంగా పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆంధ్ర హాస్పిటల్స్ ఎండి డాక్టర్ పివి రమణమూర్తి తెలిపారు. నవంబర్ 29 నుండి డిసెంబర్ 4 వరకు ఆంధ్ర హాస్పటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లను నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సినీ నటి సమంతా శనివారం హాస్పటల్‌కు వచ్చి ఆపరేషన్లు చేయంచుకున్న చిన్నారులతో ముచ్చటించింది. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో సమంతాతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనానంతరం ఆపరేషన్ల కోసం హైదరాబాద్ వెళ్లకుండా అత్యాధునిక పరిజ్ఞానంతో ఆపరేషన్లు విజయవాడలోనే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ నలుమూలల నుండి వివిద విభాగాల్లో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో వారం రోజుల్లో 18 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. చిన్నపిల్లల గుండె ఆపరేషన్లుకు సహకరించిన సమంత ప్రత్యూష సంస్థకు ఇంగ్లాండ్ వైద్యులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు ఆపరేషన్లు చేయించుకున్న వారిని మంత్రి కామినేని శ్రీనివాస్ కలిశారని తెలిపారు. వైద్యులను సిబ్బంది అభినందించినట్లు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి ఆపరేషన్లు గూర్చి తెలిపామన్నారు.

ది కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్
ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
* వైద్యరంగంలో డ్రగ్ ట్రేడర్స్ ప్రాధాన్యత మరింత
* మంత్రి కామినేని శ్రీనివాస్
విజయవాడ, డిసెంబర్ 5: వైద్యరంగంలో డ్రగ్ ట్రేడర్స్ ప్రాధాన్యత మరింత పెరిగిందని, నాణ్యతతో అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. పాత బస్టాండ్ సమీపంలోని స్వర్ణ వేదికలో శనివారం ది కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అధ్యక్షులుగా సిసి కేశవరావు, కార్యదర్శిగా పల్లపోతు మురళీ కృష్ణ (కొండపల్లి), కోశాధికారిగా డి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యుల చేత అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యయులు పి.రోసారావు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ వైద్య రంగంలో కొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయని, అత్యాధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. వైద్యులు వ్యాధిగ్రస్థులకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ కీలకమైన పాత్ర పోషించేది మెడిసిన్ అన్నారు. అసోసియేషన్ సేవా ధృక్పథంతో ప్రతినెలా మెడికల్ క్యాంపులు నిర్వహించి, పేద రోగులకు మందులను పంపిణీ చేసి సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డెప్యూటీ డైరెక్టర్ డి.రవికుమార్, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష కార్యదర్శులు జయంతి వెంకటేశ్వర్లు, సిఎ పెనుగొండ సుబ్బారాయుడు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కరరావు, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, అధ్యక్షులు కృష్ణారెడ్డి, కార్యదర్శి ఎమ్.రామకృష్ణారావు, కోశాధికారి టి.కృష్ణమూర్తి, డాక్టర్లు 13 జిల్లాల డ్రగ్ అండ్ ట్రేడ్ సభ్యులు, మెడికల్ రిప్రజంటేటివ్‌లు పాల్గొన్నారు.