రాష్ట్రీయం

నల్లగొండ ఎమ్మెల్సీ బరిలో నలుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిల మధ్య ప్రధాన పోటీ
నల్లగొండ, డిసెంబర్ 12: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా టిడిపి అభ్యర్థి సాధునేని శ్రీనివాస్‌రావు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా కాంగ్రెస్ రెబల్ సుంకరి మల్లేశంగౌడ్, మిట్టా పురుషోత్తంరెడ్డిలు పోటీలో మిగిలారు. ప్రధాన పోటీ తేరా చిన్నపరెడ్డి, రాజగోపాల్‌రెడ్డిల మధ్య సాగనుండగా ద్విముఖ పోటీలో నెగ్గేందుకు అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్ సర్వశక్తులొడ్డుతుండగా ఎన్నికలు ఆసక్తికరంగా సాగనున్నాయి.

వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

నియామక పత్రాన్ని అందుకున్న కొండా మురళి
కార్యకర్తల్లో జోష్.. భారీ ర్యాలీ ప్రదర్శన
నేటి నుండి కోడ్ వర్తించదు

వరంగల్, డిసెంబర్ 12: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్సీగా కొండా మురళీధర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో కొండా మురళికి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని అందజేశారు. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థిగా కొండా మురళి నామినేషన్ వేశారు. టిడిపి, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాల నుండి ఎవరూ నామినేషన్ వేయలేదు. అయితే, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులుగా బి.చంద్రవౌళి, జట్టమహబూబ్‌రెడ్డి, మోడెం మల్లేష్, ఆర్.రవిందర్, అనుమాండ్ల నరేందర్‌రెడ్డిలు నామినేషన్ వేయగా నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కొండా మురళికి మద్దతుగా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరో అభ్యర్థి అనుమాండ్ల నరేందర్‌రెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైంది. శనివారం వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో గడువు ముగియగానే ఎమ్మెల్సీ బరిలో పోటీలో కొండా మురళి తప్ప మరెవరు లేకపోవడంతో ఏకగ్రీవంగా కొండా మురళి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నియామక పత్రాన్ని తీసుకొని బయటకు రాగానే కార్యకర్తలంతా ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్ కార్యాలయం నుండి కార్యకర్తలు బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ ప్రతిపక్షాలు కనీసం పోటీ చేయడానికి కూడా సాహసించలేకపోయాయని, బంగారు తెలంగాణ కెసి ఆర్‌తోనే సాధ్యమని బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా తనకు మద్దతుగా ఉపసంహరించుకున్నారన్నారు.