ప్రకాశం

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, జనవరి 23: స్థానిక సారస్వతనికేతనం గ్రంథాలయాన్ని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శనివారం సందర్శించారు. గ్రంథాలయంలోని గ్రంథాలను, మాజీ రాష్టప్రతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రతిష్ఠించిన ధ్వజస్థంభాన్ని, మహాత్మాగాంధీ చేతి కర్రను ఆయన పరిశీలించారు. సారస్వతనికేతనం చారిత్రక సంపదగా ఆయన అభివర్ణించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ 1969లో వేటపాలెంలోని తన బంధువుల ఇంట కొద్దిరోజులు గడిపానని, అప్పట్లో ప్రతిరోజు గ్రంథాలయాన్ని సందర్శించే వాడినని రాశారు. తన బంధువుల ఇంటిని పరిశీలించేందుకు ఆ ప్రాంతంలో కొద్దిసేపు తిరిగి ఆచూకీ లభించకపోవడంతో అసంతృప్తి చెందారు. గ్రంథాలయ సిబ్బంది గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వివరాలను, అభివృద్ధిని వివరించారు.

జిల్లా అభివృద్ధే చంద్రబాబు లక్ష్యం
* కేంద్రమంత్రి సుజనాచౌదరి స్పష్టం
కనిగిరి రూరల్, జనవరి 23: ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయం అని కేంద్రమంత్రి వై సుజనాచౌదరి అన్నారు. శనివారం స్థానిక ఎఎంసి ప్రాంగణంలో ఎఎంసి చైర్మన్, వైస్ చైర్మన్లు దారపనేని చంద్రశేఖర్, ఐవి నారాయణ, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రం 17,500 కోట్ల రూపాయల ఆర్థికంగా లోటులో ఉన్నా ప్రజాసంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదన్నారు. గత 18 నెలల్లో ప్రభుత్వం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని, ఎన్ని సమస్యలు ఉన్నా 24వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 12వేల కోట్ల రూపాయల డ్వాక్రా సభ్యుల రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదేనని, నీరు - చెట్టు పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని చూడలేని ప్రతిపక్ష నాయకులు పలు విధాలుగా విమర్శించడం విచారకరమని అన్నారు. గతంలో కనిగిరి నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 50కోట్ల రూపాయలు మంజూరు చేశానని ఆయన తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కదిరి బాబురావు మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం అయిన కనిగిరి నియోజకవర్గానికి అధికంగా నిధులు ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్టమ్రంత్రులకు విజ్ఞప్తి చేశారు.
ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు
ఎఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, ఐవి నారాయణ, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్‌చేసి లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపి శ్రీరామ్ మాల్యాద్రి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జడ్‌పి వైస్ చైర్మన్ నూకసాని బాలాజి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు అన్నా రాంబాబు, దివి శివరాం, కరణం వెంకటేష్, కందుల నారాయణరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ షేక్ చినమస్తాన్, పామూరు సర్పంచ్ డివి మనోహర్, టిడిపి నాయకులు ఆర్ శ్రీనివాసరెడ్డి, జిలాని, లక్ష్మయ్య తదితర నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుతమ్ముళ్ల సమావేశం రద్దు
యర్రగొండపాలెం నేతల మోహరింపుతోనే కేంద్రమంత్రి సమావేశం రద్దు
తెరపైకి రాని ఈదర చేరిక వ్యవహరం * రాస్తారాకో చేపట్టిన బూదాల వర్గీయులు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 23:జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుతమ్ముళ్లు భారీగా మోహరించటంతో కేంద్రమంత్రి సుజనాచౌదరి సమక్షంలో జరగనున్న తెలుగుతమ్ముళ్ల జిల్లా సమీక్షా సమావేశం రద్దు అయింది. శనివారం రాత్రి ఒంగోలులోని రిమ్స్‌లో నూతనంగా నిర్మించిన వాటర్‌ట్యాంకును, చేపలమార్కెట్‌ను మంత్రి సుజనాచౌదరి లాంఛనంగా ప్రారంభించిన అనంతరం స్థానిక ఒంగోలు డెయిరీ ఆవరణలో తెలుగుతమ్ముళ్లతో సమీక్షా సమావేశం జరగాల్సి ఉంది. కాగా యర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన బూదాల అజితారావు వర్గం, మనే్న రవీంద్ర వర్గాలు భారీగా కార్యకర్తలు, నాయకులను మోహరించటంతో సమావేశం రసాభాసా అవుతుందన్న ఉద్దేశంతో మంత్రి చేపలమార్కెట్‌ను ప్రారంభించిన వెంటనే రోడ్డుమార్గం ద్వారా హైదరాబాదుకు పయనమయ్యారు. యర్రగొండపాలెం నియోజకవర్గంతోపాటు పలు నియోజకవర్గాల సమస్యలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకుని సమావేశాన్ని రద్దుచేసి వెళ్లటం జరిగింది. జిల్లాలోని కొంతమంది వైకాపా శాసనసభ్యులు తెలుగుదేశంపార్టీ గూటికి చేరనున్న నేపధ్యంలో ఆ నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జులు సైతం కేంద్రమంత్రి వద్ద పంచాయితీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాని తెలుగుతమ్ముళ్ల మధ్య ఘర్షణలు జరగనున్న నేపధ్యంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి సమీక్షా సమావేశాన్ని రద్దుచేయటంతో వైపాలెం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు తెలుగుదేశంపార్టీ గూటిలోకి చేరే విషయం కూడా ప్రస్తావనకు రాలేదని తెలిసింది. ఉదయం నుండి రాత్రి వరకు సుజనాచౌదరి జిల్లావ్యాప్తంగా సుడిగాలి పర్యటన జరిపారు. ఈ పర్యటనలో ఈదరను పార్టీలో చేర్చుకునే అంశంపై ఎక్కడా చర్చకు రాలేదని సమాచారం. సుజనాచౌదరి సమక్షంలో ఈదరను అధికారికంగా చేర్చుకుంటారన్న చర్చ జరిగింది. కాని ఈదర వ్యవహరం చర్చకు రాకపోవటంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇదిఇలాఉండగా జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పర్యవేక్షణలో కేంద్రమంత్రి సుడిగాలి పర్యటన విజయవంతమైందనే చెప్పవచ్చు.
ఇదిఇలాఉండగా తమ బాధలను కేంద్రమంత్రికి చెప్పుకునేందుకు వచ్చినప్పటికి సమావేశం రద్దుకావటంపై వైపాలెం తెలుగుదేశంపార్టీ నాయకురాలు బూదాల అజితారావు భర్త కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకేంద్రం వద్ద రాస్తారాకో జరిగింది. ఈసందర్బంగా పోలీసులు కలుగుచేసుకుని వారిని పక్కకుతీసుకువెళ్ళారు. ఈసందర్భంగా బూదాల వర్గీయులు మాట్లాడుతూ తమ బాధలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్ళేందుకు వచ్చినప్పటికి సమావేశం రద్దుఅయిందన్నారు. ఎస్‌సినియోజకవర్గంలో అగ్రకులపెద్దల పెత్తనం ఏమిటని వారు ప్రశ్నించారు.

ఘనంగా నేతాజి జయంతి వేడుకలు
చీరాల, జనవరి 23: నేతాజి సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కామన్ మ్యాన్ సర్వీసు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఈపూరుపాలెంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చెక్‌పోస్టు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీపార్కు మీదుగా నేతాజీ కల్యాణ మండపం వరకు సాగింది. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి బ్రహ్మం మాట్లాడుతూ జాతి ముద్దుబిడ్డల్లో నేతాజి అగ్రగణ్యుడన్నారు.
నేతాజీ యూనియన్ ఆధ్వర్యంలో : సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజి యూనియన్ ఆధ్వర్యంలో చీరాల మండలం ఈపూరుపాలెం నేతాజి కల్యాణమండపం వద్దనున్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుల్లో ఒకడని కొనియాడారు. దేశం మరువలేని గొప్ప నాయకుల్లో నేతాజీ ముఖ్యుడన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుద్దంటి సరోజినీ దేవి, యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాశన చంద్రశేఖర్, అధ్యక్ష, కార్యదర్శులు నాశన సురేష్, బూదాటి శ్రీనివాసరావు, కొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ కోట సాయికృష్ణ, పడవల లక్ష్మణస్వామి, అవ్వారు బాలకృష్ణ, పూర్వ సర్పంచ్ పాలపర్తి నాగేశ్వరరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్‌లో ప్రాక్టికల్స్ పరీక్షల్లో
జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా
ఒంగోలు, జనవరి 23: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాల రాష్ట్ర నాయకులు భైరపనేని సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు కెవి రమణారెడ్డి, నాయకులు వై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఒంగోలులోని ఇంటర్మీడియట్ ఆర్‌ఐఓ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు మణికంఠారెడ్డి ధర్నా కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రయివేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం నాయకులు సూర్యనారాయణ, కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, వైకాపా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు మణికంఠారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల ప్రాక్టికల్స్ పరీక్షలకు జంబ్లింగ్ విధానాన్ని విద్యాశాఖ పెట్టటం బాధాకరం అన్నారు. అసలే సిలబస్ పూర్తికాక విద్యార్దులు ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న సామెతగా జంబ్లింగ్ విదానంలో పరీక్షలు పెట్టాలని చూడటం విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేయటమే అవుతుందని వారు వాపోయారు. ఒక వేళ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలనుకుంటే అన్ని వసతులు వున్న వారి వారికి చెందిన ప్రవేటు జూనియర్ కాలేజీలలో పరీక్షలు రాసేలా అయినా చూడాలి, లేక అసలు ప్రాక్టిల్స్ పరీక్షలనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం
ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
- జిల్లా సంయుక్త కలెక్టర్ హరిజవహర్‌లాల్
ఒంగోలు, జనవరి 23: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఘనంగా పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు జిల్లా అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిపిఓ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవ ఏర్పాట్లపై జరిగిన విలేఖర్ల సమావేశంలో జెసి హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు దోహదపడుతుందన్నారు. విద్యార్థులతో ఈనెల 25న ఉదయం 9గంటలకు డిఆర్‌ఆర్‌ఎం హైస్కూలు నుండి రిమ్స్, ఒంగోలు నుండి ప్రారంభమై ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలు అన్ని పోలింగ్‌స్టేషన్ల పరిధిలోను సంబంధిత బూత్‌లెవెల్ అధికారులచే గ్రామరాజకీయ , ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.