తెలంగాణ

గ్రేటర్‌లో కుమారుడు.. ఖేడ్‌లో అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఒకవైపుగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాగుతుండగా, అదే సమయంలో మరోవైపునారాయణఖేడ్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల బాధ్యత మొత్తం తన కుమారుడు, ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌కు ముఖ్యమంత్రి అప్పగించారు. అదే సమయంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను ముఖ్యమంత్రి అదే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనల్లుడు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. మాస్ లీడల్‌గా పేరున్న హరీశ్‌రావు సిద్దిపేటలో మంచి పట్టు సాధించారు. కెసిఆర్ ఈ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి కూడా హరీశ్‌రావు కెసిఆర్‌కు తోడుగా నియోజకవర్గ కార్యకలాపాల్లో పాలు పంచుకునే వారు. కెసిఆర్ పార్లమెంటుకు వెళ్లిన తరువాత 2004 నుంచి హరీశ్‌రావు సిద్దిపేట నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన జిల్లామంత్రి మరింత బలపడ్డారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణించిన తరువాత ఏకగ్రీవ ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రయత్నించింది. అయితే పోటీ చేయనున్నట్టు తొలుత హరీశ్‌రావే ప్రకటించారు. పోటీ చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచే వ్యూహాత్మకంగా ఈ నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమా చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అడపాదడపా ప్రచారం సాగించినా ఎక్కువగా నారాయణఖేడ్ నియోజకవర్గంపైనే దృష్టిపెట్టారు. నారాయణఖేడ్‌లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీల మధ్యనే ఉంది. వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం ఉప ఎన్నికలకు ముందు జరిపించిన సర్వేలో వరంగల్‌లో 60శాతానికి పైగా ఓట్లు వస్తాయని, నారాయణఖేడ్‌లో 57శాతం ఓట్లు టిర్‌ఎస్‌కు వస్తాయని తేలినట్టు ముఖ్యమంత్రి పార్టీ సమావేశంలో ప్రకటించారు. మొదటి నుంచి నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉంది. దాంతో విజయం కోసం టిఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో కెటిఆర్ దూసుకువెళుతున్నారు. వ్యూహ రచన కెసిఆర్‌దే అయినా అమలు చేస్తున్నది కెటిఆర్. షెడ్యూల్ ప్రకటించడానికి ముందే హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించారు. అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తివాదులను బుజ్జగించడం, ప్రచారం అన్నీ తానై నిర్వహిస్తున్నారు. రోజుకు పది సభలు నిర్వహిస్తూ, శనివారం నుంచి రోడ్ షోలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీ సంఘాలు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో ఉన్న అయ్యప్ప సొసైటీ ప్రాంతం, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో సైతం కెటిఆర్ రోడ్ షోలకు మంచి స్పందన లభిస్తోంది. మేయర్ పీఠం టిఆర్‌ఎస్ గెలుచుకోకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. అందుకే ఎలాగైనా గెలిచేందుకు శ్రమిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రచారానికి భిన్నంగా ఆంధ్ర ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్‌తోపాటు ఖేడ్‌లోనూ విజయం సాధించాలన్న లక్ష్యంతో ఈ ఇద్దరు నేతలు అడుగులు వేస్తున్నారు.