రాష్ట్రీయం

గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించే వేడుకలకు సోమవారం త్రివిధ దళాలతో పాటు పలు విభాగాల పోలీసులు నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ రిహార్సల్స్ అలరించింది. ఈ వేడుకలను నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితోపాటు అదనపు సిపి అంజనీకుమార్, ట్రాఫిక్ కమిషనర్ జితేందర్ పర్యవేక్షించారు. కొందరు ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో చొరబడి గణతంత్ర వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా నలుగురు ఐసిస్ సానుభూతిపరులు సైతం హైదరాబాద్‌లో అరెస్టైన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సికిందరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. అపరిచితులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కేంద్ర నిఘా సంస్థలతో కలసి పనిచేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ కమిషనర్ జితేందర్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం గం. 17.30లకు రాజ్‌భవన్‌కు వచ్చే అతిథుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఈ మార్గంలో స్వల్పంగా వాహనాల మళ్లింపుతోపాటు పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించడం జరిగిందన్నారు. ఈ నెల 26న మధ్యాహ్నం గం. 1.30ల నుంచి సా.గం. 7.30ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.