రాష్ట్రీయం

గనుల తవ్వకంపై లోతైన పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: గనుల తవ్వకం, కార్యకలాపాలను శాటిలైట్ ఇమేజరీ ద్వారా పర్యవేక్షించేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మధ్య గురువారం ఇక్కడ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టుకు సుదూర్ దృష్టి అని నామకరణం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా డ్రైవ్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సుభాశ్ చంద్ర తెలిపారు. హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా గనుల తవ్వకాల కార్యకలాపాలను ఎంపిక చేసిన చోట పర్యవేక్షిస్తామన్నారు. డిఫెరెంట్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీని అమలు చేస్తామన్నారు. ఎంపిక చేసిన మైనింగ్‌ల సరిహద్దులను ఖరారు చేస్తామన్నారు. ఐబిఎం అధికారులకు ఎన్‌ఆర్‌ఎస్‌ఏ శిక్షణ ఇస్తుందన్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి డైరెక్టర్ వికె దద్వాల్ మాట్లాడుతూ తమ సంస్థ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు కూడా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ ఆర్‌కె సిన్హా మాట్లాడుతూ నాగ్‌పూర్, హైదరాబాద్‌లో తమ సంస్థ ఐబిఎం సహాయంతో రిమోట్ సెన్సింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు.