ఆంధ్రప్రదేశ్‌

మా విజ్ఞప్తులు బుట్టదాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం తీరుపై ఎంపీ గల్లా తీవ్ర అసంతృప్తి
గుంటూరు, మార్చి 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని అమరావతికి నిధులు కేటాయించాలంటూ గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రశ్నించటం చూస్తుంటే టిడిపి విజ్ఞప్తులను కేంద్రం బుట్టదాఖలు చేస్తోందనే విషయం స్పష్టవౌతోంది. కేంద్రం అమరావతికి ఇప్పటివరకు కేవలం 850 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. ఏడాదికి కనీసం రూ.4 వేల కోట్లు కావాలనే అంచనాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించటం గమనార్హం. అమరావతిలో సచివాలయం, శాసనసభ, శాసనమండలి, గవర్నర్ భవనాలు, సిఎం కార్యాలయం, తదితర ఆఫీసులకు రూ.15 వేల కోట్లు కేటాయించాలని గతంలోనే కేంద్రాన్ని కోరినట్లు ఎంపి గల్లా వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది. ఇవన్నీ కేంద్రం ముందు ఉంచినప్పటికీ ఎన్‌డిఏ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నది స్పష్టవౌతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల లేమితో అల్లాడుతున్నప్పటికీ కేంద్రం స్పందించటం లేదనే విషయం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించిన తీరుతో బహిర్గతమైంది.