మహబూబ్‌నగర్

గణితం తల్లిలాంటిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ గణిత దినోత్సవంలో కలెక్టర్
మహబూబ్‌నగర్, డిసెంబర్ 22: గణితం అన్ని సబ్జెక్టులకు తల్లిలాంటిదని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అన్నారు. మంగళవారం రాజీవ్ విద్యామిషన్ సమావేశ మందిరంలో జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. అదేవిధంగా గణిత మేదావి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ నిత్య జీవితంలో గణితం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపారు. గణితం సాధారణంగా గణితమంటే విద్యార్థులు భయందోళనకు గురవుతుంటారని ఉపాధ్యాయులు చోరవ తీసుకుని గణితంపై మక్కువ పెరిగే విధంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు లేని సమాజాన్ని ఊహించలేమని ఆమె స్పష్టం చేశారు. విద్యా, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. జిల్లాలోని విద్యా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సూచనలు, సలహాల కోరకు విద్యా సలహ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సబ్జెక్టు ఫోరాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఇదే స్పూర్తిని కొనసాగించాలని కోరారు. జిల్లాలో శ్రీనివాస రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం నూటికి నూరు శాతం ఉండాలని విద్యార్థులు ఆ ఫలితాలు సాధించే విధంగా ఈ మూడు నెలల వ్యవధిలో ఎంతో కష్టపడాలని ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలిపారు. చదువులో కొద్దిపాటి వెనుకంజలో ఉన్న వారందరిపై దృష్టి కేంద్రీకరించి వీలును బట్టి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహించాలన్నారు. ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అక్షరాస్యతలో వెనుకంజలో ఉందని అక్షరాస్యతను సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన తెలిపారు. గణిత ఫోరం నిర్వహించిన పోటి పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ టికె శ్రీదేవి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి విజయలక్ష్మీబాయి, ఆర్వీఎం పిఓ గొవిందరాజులు, అధికారులు మురళీకృష్ణ, పాండురంగయ్య, మనోహర్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.