రాష్ట్రీయం

జగన్ అభివృద్ధి నిరోధకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి గంటా ధ్వజం
కడప, డిసెంబర్ 6: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడు అని, అతడు తన హోదాను విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మంత్రి గంటా యర్రగుంట్ల, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రల్లో ప్రసంగించారు. అనంతరం మంత్రి గంటా విలేఖరుల సమావేశంలో జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని ప్రతిపక్ష నేత జగన్ కడపకు చెందిన వాడుకావడం ఈ జిల్లా ప్రజల దౌర్భాగ్యమన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడం సిగ్గుచేటని, ఆయన్ను పాలనాపరంగా వేగలేకపోతున్నామన్నారు. గతంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా కలిగిన నేతలు సమకాలీకులుగా ఉండేవారన్నారు. దీంతో ముఖ్యమంత్రికి, ఆయన క్యాబినెట్‌కు ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తూ ప్రభుత్వంపై వత్తిడి చేసే వారని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ తన హోదాను విస్మరించి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు రెండు కళ్లు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ప్రపంచంలోనే ఆదర్శంగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష నేత జగన్ విమర్శలు అర్థం లేనివన్నారు. చంద్రబాబు రానున్న మూడేళ్లలో సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి రూ. 72 వేల కోట్లు ఖర్చు చేసి, పేదరిక వ్యవస్థను రూపుమాపుతూ ప్రజలు తమ సొంతకాళ్ల మీద నిలబడి ఆర్థికంగా ముందుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇకపోతే వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, అయితే జగన్ వరదలను కూడా రాజకీయం చేయడం విచారకరమన్నారు. జగన్ ఆలోచనల్లో నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. జిల్లాలో దేశస్థాయి విద్యాసంస్థలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కర్నూలులో ఏర్పాటుచేసిన ఉర్దూ యూనివర్సిటీ సెంటర్‌ను, కడపలో మరో సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిని ఆదర్శ యూనిట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), పౌర సరఫరాల రాష్ట్ర చైర్మన్ ఎం.లింగారెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్.వరదరాజులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.