గుంటూరు

జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 63779 మంది విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: జిల్లా వ్యాప్తంగా గల 305 పరీక్షా కేంద్రాల్లో 63,779 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. గత ఏడాది జిల్లాలోని 287 సెంటర్లలో 60,926 విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. గత ఏడాది కంటె 2,853 మంది విద్యార్ధులు ఎక్కువ మంది పరీక్షలు రాస్తుండటంతో 18 సెంటర్లను విద్యాశాఖాధికారులు అదనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 60,329 మంది రెగ్యూలర్ విద్యార్ధులు కాగా మిగిలిన 3,450 మంది ప్రైవేటుగా పరీక్షలు రాయనున్నారు. జిల్లాలోని 305 పరీక్షా కేంద్రాలకు 305 మందిని చీఫ్ సూపరింటెండెంట్‌లను నియమించారు. విద్యార్ధులు రాసే పరీక్షలను పర్యవేక్షించేందుకు 3,125 మంది ఉపాధ్యాయులను నియమించారు. ప్రైవేటుగా పరీక్షలు రాసే విద్యార్థుల కోసం జిల్లాలో 20 సెంటర్లను ఏర్పాటు చేయగా, రెగ్యూలర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 285 కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో 8 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 10వ తరగతి ప్రశ్నాపత్రాలు తరలించేందుకు 34 రూట్లను గుర్తించారు. ఆయా రూట్లల్లో 134 మంది విద్యాశాఖాధికారులు పర్యవేక్షణలో పరీక్షలకు కావాల్సిన సామాగ్రిని తరలిస్తారు. పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా పర్యవేక్షించేందుకు 14 ప్లైయింగ్ స్వ్కాడ్‌లను ఏర్పాటు చేశారు. 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అవసరమైన ప్రశ్నాపత్రాలు, మిగిలిన ముఖ్యమైన పత్రాలను జిల్లా కేంద్రమైన గుంటూరులోని నగరంపాలెం స్టాల్ గరల్స్ హైస్కూల్‌లో భద్రపరిచి 24 గంటలు పోలీసు బందోబస్తు కల్పించనున్నారు. జిల్లాలోని పరీక్షలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు జిల్లా విద్యాశాఖాధికారి పర్యవేక్షణలో కొనసాగనున్నాయి.