గుంటూరు

సంబరంలా జగన్ గృహప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలో నిర్మించిన నూతన గృహంలోకి ప్రవేశించారు. సర్వమత ప్రార్థనలు, రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన అశేష జనవాహిని సాక్షిగా ఆయన ఉదయం 8.19 గంటలకు నూతన గృహంలోకి సతీసమేతంగా ప్రవేశించారు. అనంతరం మహానేత వైఎస్ విగ్రహన్ని ఆవిష్కరించి, గృహ సముదాయంలోనే ఏర్పాటు చేసిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా తాడేపల్లిలోని నూతన గృహంలోకి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. జగన్ గృహ ప్రవేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో తాడేపల్లి ప్రాంతాం జై జగన్ నినాదాలతో మార్మోగింది. ఇక నుంచి పార్టీ కార్యాకలాపాలను జగన్ తాడేపల్లి నుంచే చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుపాటి హితేష్ చెంచురామ్, చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూడు రోజుల పాటు జగన్ తాడేపల్లిలోనే ఉండి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై త్వరలో ప్రారంభించనున్న బస్సు యాత్రకు సంభందించిన రూట్‌మ్యాప్‌ను పరిశీలిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. గత కొంత కాలంగా జగన్ ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధానిని పులివెందులకు తరలిస్తారని అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికి తెరదిగడంతో పార్టీలో నూతనోత్తేజం వచ్చింది. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. పదేళ్లు ఉమ్మడి రాజధానిని ఓటుకు కోట్లు కేసుతో వదలి అమరావతికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఇంత వరకు శాశ్వత భవనం నిర్మించుకోలేదని తాత్కాలిక భవనాలతోనే కార్యకలాపాలు జరుపుతున్నారని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు అమరావతిలో శాశ్వతభవనం కట్టుకోలేదని జగన్ మాత్రం శాశ్వత భవనం, కార్యాలయం ప్రారంభించడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి, విజయసాయిరెడ్డి, పార్ధసారధి, కోడాలి నాని, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.