గుంటూరు

లోకకళ్యాణార్ధం మహారుద్రాభిషేకం, భస్మాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 14: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యక్షేత్రమైన అమరావతిలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ ఆర్థిక సహకారంతో అమరావతి నగరంలో లోకకళ్యాణార్ధం మహారుద్రాభిషేకం, మహా భస్మాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. సాధు సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన రుద్రాభిషేకాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు, తెలుగుదేశం నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే పవిత్ర కృష్ణవేణి మాతకు కార్తీకపౌర్ణమి సందర్భంగా పంచహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బాలచాముండికా అమరేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను హంసతూలికాతల్పంగా ఏర్పాటుచేసిన తెప్పపై స్వామివార్లను ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కెబి శ్రీనివాసరావు, ఆలయ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.