గుంటూరు

వేడెక్కుతున్న పేట రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దుతో ప్రజలందరూ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నాయకులు అతి వేగంగా పార్టీలు మారుతూ రాజకీయాలను వేడేక్కిస్తున్నారు. రాజకీయాల ఉద్ధండుల కోట, పల్నాడు ముఖద్వారం నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణల నేపధ్యంలో రోజు రోజుకూ రాజకీయాలు మారుతున్నాయి. కనుచూపు మేరలో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ కాంగ్రెస్, వైయస్సార్‌సీపీ నాయకులు రాత్రికి రాత్రి పార్టీలు మారుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైయస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం వైయస్సార్‌సీపీ జిల్లా నాయకులతో కలిసి వెళ్లి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో అధినేత జగన్మోహన్‌రెడ్డిని కలిసి ఈనెల 16లేదా18తేదీల్లో నరసరావుపేట లేక గుంటూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, వైయస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరో వైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిపట్టు ఉన్న రొంపిచర్ల మండలంలోని చపారపు గోపాలరెడ్డి వర్గానికి చెందిన సుమారు 700 కుటుంబాలు రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే తెలుగుదేశం వర్గాలతో సమాలోచనలు జరిపి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి పుంజుకుంది. ఇటీవలే వైయస్సార్‌సీపీకి చెందిన రాష్ట్ర బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కపలవాయి విజయకుమార్ తదితరులు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన సందర్భాన్ని పురస్కరించుకుని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నివురుగప్పిన నిప్పులా కాంగ్రెస్, వైయస్సార్‌సీపీలపై ఆధిపత్యం సాధించేందుకు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. జవజీవాలు లేని కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి నియోజకవర్గానికి దూరమై, హైదరాబాద్‌లో కాలం వెళ్ళదీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి రాజకీయ డోలాయమానంలో కొట్టు మిట్టాడుతున్న కాసు తనయుడు కాసు మహేష్‌రెడ్డి అన్ని అవకాశాలను చేజార్చుకుని, చివరిలో వైయస్సార్‌సీపీ గూటికి చేరేందుకు నిర్ణయించుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.మహేష్ రెడ్డి వైయస్సార్‌సీపీలో చేరితే ఆ పార్టీకి మంచి పట్టు లభిస్తుందని, ఆ పార్టీ నాయకులు భావిస్తున్న తరుణంలో రొంపిచర్ల మండలంలోని అటు వైకాపాకు ఇటు కాసు వర్గానికి గట్టి మద్దతుదారులైన గోపాలరెడ్డి వర్గం టీడీపీలోకి ఆకస్మికంగా వెళ్ళడం ఒకింత విస్మయాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే వైకాపాకు చెందిన రొంపిచర్ల జడ్‌పీటీసీ గెల్లి శిరీషారెడ్డి వర్గం వైకాపాకు రాజీనామా చేసిన విషయం విదితమే. ఒక వైపు కరెన్సీ కష్టాలతో ప్రజలు విలవిల్లాడుతుండగా మరో వైపు నియోజకవర్గంలో పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులు రాజకీయాలను వేడిక్కిస్తున్నారు. కార్యకర్తలు మాత్రం దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు.

పోలవరం నిర్వాసితులను రెచ్చగొడుతున్న జగన్
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 8: దేశ అత్యున్నత సభ పార్లమెంటులో ఆమోదించిన 2013 భూ సేకరణ చట్టాన్ని భూస్థాపితం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని, పోలవరం నిర్వాసితులను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన పోలవరం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిచేస్తుంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష నేత ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తూ నిర్వాసితులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నష్టపరిహారం అనేది ఎక్కడైనా చట్టాలకు అనుగుణంగానే ఇస్తారనే చిన్న విషయం కూడా జగన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. భూ సేకరణ చట్టాన్ని ఖాతరు చేయకుండా రెట్టింపు పరిహారం ఇస్తామని చెప్పి అమాయకులు, పేద ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. గతంలో కూడా పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు అభివృద్ధిని అడ్డుకుని రాజధాని భూముల పేరుతో రైతులను సైతం రెచ్చగొట్టి చివరకు విఫలమయ్యారన్నారు. పోలవరం పూర్తిచేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని చంద్రబాబు ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నారన్నారు. జనవరి 1 నుండి 100 రూపాయలకే వైద్యబీమా అందేలా మరో కొత్తపథకానికి సిఎం శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.