గుంటూరు

కాలచక్ర భూముల భూ సేకరణ : జెసి క్రితికాశుక్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 8: మండల కేంద్రమైన అమరావతిలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 16 ఎకరాల కాలచక్ర భూములను భూ సేకరణ ద్వారా త్వరలో సేకరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ క్రితికాశుక్లా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం జెసి శుక్లా సిఆర్‌డిఎ, రెవెన్యూ అధికారులతో కలిసి ధ్యానబుద్ధ ప్రాజెక్టు, కాలచక్ర పొలాలను పరిశీలించారు. గతంలో ఉన్న రైతుల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, సరైన రైతుల జాబితాను తక్షణమే సేకరించాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో ఆయా రైతులకు పరిహారం చెల్లించి భూములను ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. పర్యటనలో ఆమె వెంట సిఆర్‌డిఎ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ మనోరమ, సిఆర్‌డిఎ సర్వేయర్ పార్ధసారధి, అమరావతి డిటి ఎ సాంబశివరావు, సర్వేయర్ జయకుమార్ తదితరులున్నారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించండి
రొంపిచర్ల, డిసెంబర్ 8:రెవెన్యూ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో జి రవీందర్ అన్నారు. స్ధానిక తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజాసాధికారిక సర్వేపై వచ్చిన నివేదికలను వెంటనే తనకు అందచేయాలన్నారు. సర్వే జరగని కుటుంబాలను గుర్తించి సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యాలయంలో ఉన్న ఫైళ్ళను, రికార్డులను,సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మల్లేశ్వరరావు, డెప్యూటీ తహశీల్దార్ నాగూల్‌మీరా, ఆర్‌ఐ దీక్షితులు, మస్తాన్‌వలి, విఆర్వోలు పాల్గొన్నారు.