గుంటూరు

నేడు అనుపుకు సియం చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, డిసెంబర్ 8: ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ సమీపంలో శుక్రవారం ఏర్పాటు చేస్తున్న అనుపు ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో అనుపుకు మధ్యాహ్నం 3.10గంటలకు ముఖ్యమంత్రి రానున్నారు. అనంతరం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఉత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవ వేడుకలకు ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ డాక్టర్ సుధామూర్తి, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బినోద్ పాల్గొంటారు. కాగా మూడు రోజుల పాటు జరగనున్న అనుపు ఉత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రానికే అనుపు ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు కావడంతో అనుపు చుట్టూ నల్లమల అటవీప్రాంతం కావడంతో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మాచర్ల నుండి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు, హైదరాబాద్ నుండి మాచర్ల వచ్చే వాహనాలను జిల్లా సరిహద్దు ప్రాంతమైన టీ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుపు ప్రాంతంలో పోలీస్ డాగ్స్, మెటల్ డిటెక్టివ్ ప్రతి పర్యాటకుడిని తనిఖీలు చేశారు.
అనుపు ఉత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
కృష్ణానది తీరం, పర్యాటక ప్రాంతమైన అనుపులో ఇన్ఫోసిస్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉత్సవ వేడుకల పనులు గురువారం సాయంత్రానికి పూర్తి అయ్యాయి. అనుపులోని హంపీ ధియేటర్ పరిసర ప్రాంతాలు సుందర వనంగా తీర్చిదిద్దారు. కర్ణాటక రాష్ట్రం నుండి తెప్పించిన పెద్ద షామియానాలు, స్వాగత ద్వారాలు, భారీ సభావేదిక అధునాతన పద్ధతిలో నిర్మించారు.

బాలుడు అనుమానాస్పద మృతి
సత్తెనపల్లి, డిసెంబర్ 8:ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామానికి చెందిన ఓర్సు మోహనకృష్ణ (9) మంగళవారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో అదృశ్యమై గురువారం గ్రామానికి కొంత దూరంలోవున్న బావిలో అనుమానాస్పద స్థితిలో శవమైతేలాడు. సమాచారం అందుకున్న ముప్పాళ్ళ ఎస్సై శ్రీహరి తన సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకొని, మృతి చెందివున్న బాలుడ్ని బావినుండి వెలికితీసి శవపంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా బాలుడు ఇంటి సమీపాన గల వాగుదాటి పొలాల్లోవున్న బావిలో శవమైతేలడంతో గిట్టనివారు తన కుమారుడ్ని చంపి బావిలో పడేసివుంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మోహనకృష్ణ తొండపి గ్రామంలోని పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నాడని గ్రామస్తులు తెపిపారు. తండ్రి ఓర్సు ఏడుకొండలు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని ముప్పాళ్ళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.