గుంటూరు

ఈ కల్తీకారం..హానికరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 8: గుంటూరు కేంద్రంగా ఇటీవల వెలుగుచూసిన కల్తీ కారం నిల్వలు ప్రజారోగ్యానికి ప్రమాదకరమైనవిగా రసాయన పరీక్షలలో తేలింది. రాష్టవ్య్రాప్తంగా విజిలెన్స్, మార్కెటింగ్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి 39 రకాల శాంపుల్స్ సేకరించారు. నగరంలోని పలు కోల్డు స్టోరేజీలతో పాటు మిల్లులతో పాటు రోడ్ల వెంట విసిరేసిన 65వేల బస్తాల కల్తీ కారం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పది శాంపుల్స్‌ను పరీక్షలకు పంపారు. ప్రజారోగ్యానికి భంగకరంగా కారంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న పౌడర్‌ను కలిపారని పరీక్షలలో తేలింది. దీనివల్ల దీర్ఘ కాలిక వ్యాధులతో పాటు క్యాన్సర్ సోకే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యనిపుణులు తేల్చారు. ఇప్పటి వరకు నిర్వహించిన పది రకాల శాంపుల్స్‌లో ఇదే రకమైన ఫలితాలు కనిపించాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కేంద్రంగా వెలుగుచూసిన కల్తీ కారం నిల్వలను ఇతర జిల్లాల్లో ఇప్పటికే విక్రయించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఖమ్మం- గుంటూరులో కల్తీ రాకెట్ ఏయే జిల్లాలకు కల్తీ కారాన్ని, ఇతర నిత్యావసరాలను రవాణా చేసిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. గుంటూరు మిర్చియార్డు పరిధిలో కల్తీ వ్యాపారం చేస్తున్న అంబటి కాశీవిశ్వనాథం, మానుకొండ బ్రహ్మయ్య, బొల్లేపల్లి గోపీ, వంగా చలపతిరావు, సాని నాగేంద్రం లైసెన్స్‌లను రద్దుచేస్తున్నట్లు ఎఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రకటించారు. ఇదిలా ఉండగా అక్రమ వ్యాపారులపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధమైంది. పరీక్షల నివేదిక ఆధారంగా కల్తీవ్యాపారులపై సిఆర్‌పిసి 272, 273, 120బి, 420 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు. తూనికలు, కొలతల శాఖ పరిధిలో మరో 13 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 90 శాతం మేర కల్తీలను నియంత్రించామని ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ పూర్ణ చంద్రరావు తెలిపారు. నివేదికలు పూర్తిస్థాయిలో అందినవెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.