గుంటూరు

అర్బన్ పరిధిలో సబ్ డివిజన్‌ల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 8: గుంటూరు అర్బన్ పరిధిలోని సబ్ డివిజన్ల అధికారిక ప్రాంతపు హద్దుల్లో మార్పులు చేర్పులు అంశంపై అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పి త్రిపాఠి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతమున్న సబ్ డివిజన్లలోని పోలీసుస్టేషన్ల సంఖ్య, గ్రామాలు, ప్రజల సంఖ్య, విస్తీర్ణం, సిబ్బంది పనిభారం తదితర విషయాలపై ఆరా తీశారు. ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే సర్దుబాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సబ్ డివిజన్ల విస్తరణపై దృష్టిసారించామని చెప్పారు. దీనిపై సమగ్ర వివరాలు సేకరించి అధికారులకు తెలియజేస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్‌పి జె భాస్కరరావు, తిరుపాల్, డిఎస్‌పిలు, సిఐలు తదితరులు పాల్గొన్నారు.