గుంటూరు

దమ్ముంటే నన్ను అడ్డుకోండి: జూపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై వైసిపి కార్యకర్తలు దాడికి దిగినా ఓ మహిళా ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన రోజా కానీ, పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కానీ స్పందించకపోవటంలోని ఆంతర్యమేమిటని టిడిపి అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. శుక్రవారం రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కారును కూడా అడ్డుకునేందుకు వైసిపి కార్యకర్తలు విఫలయత్నం చేశారన్నారు. వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తనపై దాడికి కార్యకర్తలను ప్రేరేపించారని ఆరోపించారు. దమ్ముంటే తన కారును అడ్డుకోవాలని సవాల్ విసిరారు. దాడులకు తెగపడితే పార్టీని వీడిన ఎమ్మెల్యేలు తిరిగొస్తారనే భావనతో దౌర్జన్యాలకు ఒడికడుతున్నారని ధ్వజమెత్తారు. అదే ప్రభుత్వం తలచుకుంటే వైసిపి నేత యాత్రలు, సభలు నిర్వహించగలరా? అని ప్రశ్నించారు. వైసిపిలా దిగజారుడు రాజకీయాలు చేయటం టిడిపి నైజం కాదన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అభివృద్ధి నిరోధకులకు తగిన గుణపాఠం చెప్తారన్నారు.
అగ్నిప్రమాదంలో రెండు ఎకరాల వరిగడ్డి దగ్ధం
రొంపిచర్ల, జనవరి 20: మండల కేంద్రమైన రొంపిచర్లలో శుక్రవారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు ఎకరాల వరిగడ్డి దగ్ధమైంది. గ్రామానికి చెందిన రెబ్బా శ్రీను పొన్నూరు నుండి తన పశువుల కోసం రెండు ఎకరాల వరిగడ్డిని కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. ట్రాక్టర్ నుండి వరిగడ్డిని కిందకు దించే సమయంలో పైన ఉన్న కరెంటు తీగలు తగలడంతో షాట్‌సర్క్యూట్‌తో నిప్పంటుకుని గడ్డి దగ్ధమైంది. 40 వేల రూపాయల నష్టం అంచనా. నర్సరావుపేట నుంచి అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.