గుంటూరు

రైతుల బాగోగులు చూసే బాధ్యత ప్రభుత్వానిదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: ఆసియాలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డులో రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లిఖార్జునరావు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (మిర్చియార్డు) ఆవరణలో రైతు ఉచిత భోజన పథకాన్ని కమిషనర్ మల్లిఖార్జునరావు, యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఇస్కాన్ సౌత్ ఇండియా డివిజనల్ కౌన్సిల్ చైర్మన్ సత్యగోపినాథ్‌దాస్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ రైతుల బాగోగులు చూసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. యార్డుకు సరుకు తీసుకుని వచ్చే రైతులు భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఈ దృష్ట్యా ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. భోజన పథకం సక్రమంగా అమలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రైతు విశ్రాంతి భవన్‌లో కూడా రైతుల కోసం అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కమిషనర్ మల్లిఖార్జునరావుల సూచనల మేరకు ఇస్కాన్ సౌజన్యంతో రైతాంగానికి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో యార్డు కార్యదర్శి ఎం దివాకర్, వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్లు ఎస్‌ఎస్‌పి జాదా, బండ్లమూడి జ్యోతికుమార్, తాళ్ల నాగరాజు, శింగంశెట్టి వీరయ్య, శ్రీరామ్ రాజీవ్ ఆనంద్, షేక్ చినబాజి, ఉప్పుతల సాంబశివరావు, గుడిమెట్ల దయారత్నం, బాణావత్ రాజీ, పసుపులేటి శ్రీనివాసరావు, మన్నవ వెంకటేశ్వరరావు, యార్డు అధికారులు ఎండి ఇస్మాయిల్, కుటుంబరావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణానదిలో మునిగి యువకుడి మృతి
అచ్చంపేట, జనవరి 20: అచ్చంపేట మండలం చామర్రు కృష్ణానదిలో యువకుడు మునిగి దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం, కుందుర్తి గ్రామానికి చెందిన చలంచర్ల ఏడుకొండలు (27) గత రెండు సంవత్సరాలుగా తన భార్య రామాంజమ్మ ఊరైన చామర్రులో కాపురం ఉంటున్నాడు. ఈనెల 18న కృష్ణాజిల్లా నందిగామలో పనిపై తన భార్య తమ్ముడు రామారావుతో కలిసి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో రామారావు కాసరబాద వద్ద కృష్ణానది వద్దకు చేరుకుని పడవలో ఇంటికి చేరుకున్నాడు. ఈ సమయంలో వద్దని వారిస్తున్నప్పటికీ కొండలు నదిలో ఈదుకుంటూ వస్తానంటూ అక్కడే ఆగిపోయాడు. ఎంతకూ ఇంటికి చేరకపోయే సరికి తిరిగి వెనక్కు వెళ్లాడన్న ఉద్దేశంతో కృష్ణాజిల్లాలో తమ బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేశారు. అయినా సమాచారం లేకపోవడంతో అనుమానం కలిగి కృష్ణానదిలో గజ ఈతగాళ్లతో వెతుకులాట ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కొండలు మృతదేహం నదిలో లభించింది. నదిలో ఈదలేకనే కొండలు మృత్యువాత పడి ఉంటాడని బంధువులు చెప్తున్నారు. మృతుడికి భార్య రామాంజమ్మతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.