గుంటూరు

పద్యనాటకాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 21: ‘దేవాదిదేవ నిను కీర్తించి భజింప మాకు తరమా, సకల లోక రక్షకా, చైతన్య స్వరూప, అభీష్ట భక్తవరదాయకా’ అంటూ పలువురు రంగస్థల నటీనటులు తమ గాత్ర మాధుర్యాలతో ఇష్టదైవాలను ప్రార్ధిస్తూ, పాత్రోచితమైన సహజ నటనాకౌసలాన్ని మేళవించి, సమర్పించి, ప్రదర్శించిన పద్య నాటకాలు భక్త్భివ భరితమై అలరారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్థ నిర్ధేశకత్వంలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర వేదికపై నిర్వహిస్తున్న 2016 నంది నాటకోత్సవాల్లో భాగంగా 4వ రోజైన శనివారం నాలుగు కళా సంస్థలు ప్రదర్శించిన పద్యనాటకాలు వైవిధ్యభరితంగా సాగాయి. తొలిగా చెరుకుపల్లి ఉషోదయ నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన వీరభద్ర విజయం శివపురాణాంతర్గతమైన దక్షయజ్ఞంలోని ప్రధాన ఇతివృత్తాలుగా చేసుకుని ప్రదర్శించారు. దక్షయజ్ఞంలో భాగంగా శివుడిని నిందిస్తూ దక్షుడు చేసిననిందారోపణలు, పార్వతీదేవికి జరిగిన అవమానం తదితర సన్నివేశాలతో పాటు పరమేశ్వరుడు దీనికి స్పందించి వీరభద్రుడ్ని దక్షయజ్ఞ స్థలికి పంపడం, అనంతరం జరిగిన పరిణామాల్లో వీరభద్రుడు సాధించిన ఘన విజయాన్ని ఈ పద్యనాటకం ఆవిష్కరించింది. 2వ ప్రదర్శనగా మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం రంగస్థల నటులు సమర్పించిన ఉషా పరిణయం పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షకజన మనోరంజకమైంది. ఉషారాణి అనిరుద్ధుడ్ని మోహించి యోగవిద్య ద్వారా తన అంతఃపురానికి, శయన మందిరానికి చెలికత్తె ద్వారా తీసుకునివచ్చి ప్రణయ సరస సల్లాపాలాడటం, దానికి ఆమె తండ్రి బాణాసురుడు ప్రతిఘటించడం, ఈ సందర్భంగా ఈశ్వరుడు, శ్రీకృష్ణుల మధ్య సంవాదం, నారద మహర్షి జోక్యంతో ప్రళయం నివారణ అవ్వడం, అంతేకాకుండా బాణాసురుడిపై శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతని గర్వాన్ని అణచడం తదితర ఘట్టాలన్నీ కూడా రమణీయంగా ప్రదర్శించారు. విశేషంగా గతంలోని తెలుగు చిత్రాల్లో పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల రూపకల్పనలో తనకు తానే మేటి అనిపించుకున్న విఠలాచారిని గుర్తుకు తెస్తూ ఈ ఉషా పరిణయం నాటకంలో నాగాస్త్రాన్ని ప్రయోగించడం, అస్త్రాలు ఒకటొకటిగా విడివడటం మొదలైన సన్నివేశాలు ప్రేక్షక జనావళిని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక ఖమ్మం వనం కృష్ణరాయలు కళాపరిషత్ కళాకారులు ప్రదర్శించిన భక్తమార్కండేయ పద్యనాటకం భక్త్భివ భరితమైంది. మృకండ మహర్షి తపస్సుకు మెచ్చిన జటాజూటధారి ఈశ్వరుడు ప్రత్యక్షమై మార్కండేయుని ప్రాణాలను రక్షించిన వైనం తదితర దృశ్యాలు నాటక కళాభిమానులను ఉత్తేజపరిచాయి. చివరి ప్రదర్శనగా భల్లారి రాఘవ కళాసమితి నందిగామ నటీనటులు సమర్పించిన పల్నాటి యుద్ధం పద్యనాటకం, పల్నాటివీరుల పౌరుషాన్ని విజ్ఞాన మందిర రంగస్థలిపై సమగ్రంగా చాటిచెప్పింది. నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు తదితరుల పాత్రల ద్వారా పల్నాటి వీరుల వీరగాధను, శౌర్యాన్ని, ధైర్యాన్ని ఈ పద్యనాటకం మరొక్కమారు చరిత్రపుటలలోకెక్కిన వాస్తవాలను గుర్తుచేసింది. అయితే అన్ని నాటకాల్లో రంగస్థల నటీనటులు ఆయా పాత్రలకు తమదైన రీతిలో న్యాయం చేసినా కొద్దిమంది కళాకారులు సంభాషణలు పలికే విధానంలోనూ, అలానే పద్యాలాపనలో తడబడటం, కొద్దిపాటి లోటనిపించింది. మరింత సాధన చేసి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నట్లయితే ఈ కళాకారులు భవిష్యత్తులో ఉత్తమ రంగస్థల కళాకోవిదులుగా రాణించే అవకాశముందని పలువురు ప్రేక్షకులు, ఈ రంగంతో అనుబంధమున్న కళాప్రియులు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తచేశారు. ప్రదర్శించిన నాటకాలకు నేపథ్య సంగీతం వీనులవిందు చేసింది. మొదటి మూడు రోజుల కన్నా 4వ రోజు ప్రదర్శనలకు అధికంగానే నాటక కళాభిమానులు విచ్చేసి ప్రదర్శనలను వీక్షించారు. సీనియర్ రంగస్థల నటీనటులు దర్శకులు ప్రదర్శనాపారితోషికాల కింద 30 వేల రూపాయల నగదును, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా స్ర్తి పాత్రధారులను సంప్రదాయబద్దంగా సత్కరించారు.