గుంటూరు

పరహితం కోరటమే పరమాత్మకు నిజమైన నివేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు కల్చరల్, ఫిబ్రవరి 2: పరహితం కోరటమే పరమాత్మకు నిజమైన నివేదనని ఆ దిశగా తమ జీవన గమనాన్ని నిర్దేశించుకున్నట్లయితే సాటి మనిషికి అలానే సమాజానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతారని గుంటూరులోని విజ్ఞాన మందిరం వేదికపై ఎఫ్‌డిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2016 నంది నాటకోత్సవాలలో భాగంగా 16వ రోజైన గురువారం ప్రదర్శించిన ఆరు నాటికలు స్పష్టం చేశాయి. సుదూర ప్రాంతాల నుంచి నాటకరంగం పట్ల, నాటక ప్రదర్శనలపట్ల అమితాసక్తితో కళాకారులు విభిన్న సందేశాత్మక నాటికలను తిలకించి కళాకారులపై ప్రశంసల జల్లులు కురిపించారు. తొలి ప్రదర్శనగా చిలకలూరిపేట సాగరి సంస్థ వారు సమర్పించి ప్రదర్శించిన నల్లజర్ల రోడ్డు నాటిక సమాజంలో స్వార్ధపూరితమైన మనుషులు ఏ విధంగా తమ మనుగడను శాసించుకుంటారో తెలియజేసింది. అమాయకులైన గ్రామీణ ప్రజలు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పణంగాపెట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే అవసరం తీరిన తరువాత తమకు సహాయాన్ని అందించిన మూర్తులను ఏవిధంగా నిరాదరణకు గురిచేస్తారో తేటతెల్లం చేసింది. ఇక రెండో ప్రదర్శనగా వింజనంపాడు స్నేహ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన జీవని నాటిక జీవన సత్యాలను విభిన్న పాత్రల ద్వారా ఆవిష్కరించింది. మూడో ప్రదర్శనగా తుళ్లూరు కళాపరిషత్, మధు థియేటర్ ఆర్ట్స్ ప్రదర్శించిన మనో నయనం సాంఘిక నాటకం ప్రదర్శన ప్రారంభమైన తొలి అంకం నుంచి చివరి వరకు ప్రేక్షక జనావళిని కట్టిపడేయటమే కాకుండా కంటనీరు తెప్పించింది. పుట్టుకతో అంధుడైన మోషే డాన్‌బోస్కో స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అంధుల జీవితాలలో వెలుగులు నింపటానికి ప్రయత్నం చేస్తాడు. వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తితో వచ్చిన మేరీ మోషేకు దగ్గరై తదనంతర కాలంలో ఆయన్ను వివాహమాడుతుంది. ఇదిలా కొనసాగుతుండగా భాటియా అనే పాత్రికేయుడు వీరిపై ప్రత్యేక వార్తలు రాసి సమాజం దృష్టికి తీసుకువస్తానని ఆ ఇద్దరి దంపతులను ఒప్పిస్తాడు వ్యక్తిగతంగా ప్రచారం ఇష్టంలేని మేరీ, మోషేలు అతనిమాట కాదనలేక తమ వ్యక్తిగత జీవిత విషయాలను, ముఖ్య సంఘటనలను వివరిస్తారు. బహుళ ప్రచారం వచ్చిన తరువాత ప్రభుత్వం స్పందించి వీరు చేస్తున్న సేవలను గుర్తించి ఆర్థిక సాయం చేయటానికి ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో వీరికి సహాయకులుగా ఉంటున్న యలమందను బెదిరించిన విలేకరి భాటియా ఏ విధంగా అయినా వారికి అనేకమంది దాతలు, ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని తీసుకురమ్మని బెదిరిస్తారు. భాటియా కుట్రకు ఈ పుణ్య దంపతులు బలవటం వారి ఆదర్శవంతమైన జీవితం సమాజానికి గొప్ప మేల్కొలుపు అవుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కళాకారులు ప్రదర్శించిన నగ్నశిల్పం సాంఘిక నాటిక, గుడివాడ నటీనటులు సమర్పించిన ఎవరు, వెనిగండ్ల గుంటూరు జిల్లా కళాకారులు ప్రదర్శించిన మధురస్వప్నం నాటికలు మానవత్వ సమానత్వానికి పెద్దపీట వేశాయి. సమాజంలో స్ర్తిలు పడుతున్న వేదనాభరిత జీవితాలను ప్రపంచానికి తెలియజేశాయి. కళాకారులందరినీ రాష్ట్ర చలనచిత్ర, టివి నాటకరంగ అభివృద్ధి సంస్థ పక్షాన పలువురు కళారంగ ప్రముఖులు ప్రదర్శనా పారితోషికాలను, ప్రశంసాపత్రాలను ఇచ్చి సత్కరించారు.

నాటకోత్సవాలకు 3 రోజుల విరామం
గుంటూరు కల్చరల్, ఫిబ్రవరి 2: రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన నగరంలోని విజ్ఞాన మందిరం వేదికపై గత నెల 18 నుంచి నిర్వహిస్తున్న 2016 నంది నాటకోత్సవాలు గురువారం నాటికి 16వ రోజుకు చేరుకున్నాయి. కాగా ఈ నాటకోత్సవాలు ఈ నెల పదో తేదీ వరకు కొనసాగుతాయి. అయితే ఆడిటోరియంను ముందుగా పలు సంస్థలు వారి కార్యక్రమాల నిమిత్తం రిజర్వు చేసుకోవడంతో మూడురోజుల పాటు నాటకోత్సవాల ప్రదర్శనకు విరామం ప్రకటించారు. తిరిగి ప్రదర్శనలు 6వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, 10వ తేదీ రాత్రితో ముగుస్తాయని ఎఫ్‌డిసి అధికారులు తెలిపారు.