గుంటూరు

అక్రమ కట్టడం కూల్చివేతతో పేటలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఫిబ్రవరి 20: పట్టణంలోని అరండల్‌పేటలో నల్లపాటి కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్ నిర్మాణాన్ని పోలీసుల సమక్షంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ కూల్చి వేయించారు. ఈ హైడ్రామా ఐద గంటల పాటు నడిచింది. బాధిత కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మర్రి రాజశేఖర్‌బాబు, ఎల్ అప్పిరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి కూల్చివేతను అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసుబలగాలు ఒకవైపు, నల్లపాటి కుటుంబ సభ్యులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, మరోవైపు మొహరించారు. ఇదే సమయంలో అరుపులు, కేకలు, వాగ్యుద్ధాలు జరిగాయి. అపార్ట్‌మెంట్ ప్రాంతంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. జీడీసీసీ మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు అరండల్‌పేటలో ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మాణం చేసుకుంటున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ప్లాన్ ఆన్‌లైన్ ద్వారా మంజూరైందని నల్లపాటి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అన్‌లైన్ ప్లాన్ మంజూరును రద్దు చేశామని మున్సిపల్ కమిషనర్ పేర్కొంటున్నారు. దక్షిణం వైపు రోడ్డు నుండి రెండు మీటర్లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీగోడ నిర్మించారని కమిషనర్ భానూప్రతాప్ తెలిపారు. అయితే ఈ అపార్ట్‌మెంట్‌ను కూల్చేందుకు ఉదయం ఆరుగంటలకే మున్సిపల్ కార్యాలయంలోని అన్ని శాఖల సిబ్బంది, పోలీసులు అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. పట్టణ సిఐ వీరయ్యచౌదరి, టూటౌన్ సిఐ సాంబశివరావు, రూరల్ సిఐ ప్రభాకర్‌లతో పాటు వినుకొండ, చిలకలూరిపేట నుండి పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతంలో మొహరించాయి.
కాగా కూల్చివేతను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి, ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. అరెస్ట్ చేసిన వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం ప్రహరీ గోడను కూల్చివేసి, పై నుండి కింద వరకు ఉన్న అపార్ట్‌మెంట్ గోడలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, కాసు మహేష్‌రెడ్డి తదితరులు విలేఖరులతో మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులు భవనాన్ని కూల్చి వేశారన్నారు.
ఎమ్మెల్యే, మంత్రి వచ్చినా కూల్చివేత ఆగదు
* మున్సిపల్ కమిషనర్
ఎమ్మెల్యేగానీ, మంత్రిగానీ ఎవరొచ్చినా అపార్ట్‌మెంట్ నిర్మాణం కూల్చివేత ఆగదని మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్ స్పష్టం చేశారు. నిర్మాణం మొత్తానికి అనుమతులు లేవని, వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. రెండో నోటీసు ఇచ్చిన తర్వాత వారం రోజుల సమయం ఇవ్వడం కుదరదని, నోటీసులు ఇచ్చిన వెంటనే కూల్చివేసే అధికారం తనకు ఉందన్నారు. పట్టణ
9 నెలల గర్భిణి మృతి
చిలకలూరిపేట, ఫిబ్రవరి 20: కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన 9 నెలల గర్భిణీ వైద్యం సక్రమంగా చేయక మృతిచెందిందంటూ మృతురాలి బంధువులు సోమవారం ఉదయం ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా, మార్టూరు మండలం, బొబ్బేపల్లి గ్రామానికి చెందిన గంగాధర పోలేశ్వరి (23) గర్భందాల్చి చిలకలూరిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నెలవారీ పరీక్షలు చేయించుకుంటుంది. శనివారం శ్వాస సక్రమంగా ఆడటం లేదని వైద్యశాలకు రాగా పరీక్షించిన వైద్యులు మందులు ఇచ్చి పంపించారు. మరలా ఆదివారం అదేవిధంగా రావడంతో వైద్యం కోసం రాగా సెలవు కావడంతో సిబ్బంది పట్టించుకోలేదు. సోమవారం ఉదయం మరలా కడుపునొప్పి రాగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మరణించింది. కొంచెం ముందుగా తీసుకువచ్చి ఉంటే రక్షించగలిగేవారమని వైద్యులు తెలిపారు. ఆమె మృతికి చిలకలూరిపేట ఆసుపత్రి నిర్వాహకులే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట సిఐ సురేష్‌బాబు ఆసుపత్రి వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.