గుంటూరు

టిడిపి విజయంపై సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, మార్చి 20: కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేయడంతో సత్తెనపల్లి పట్టణంలోని స్పీకర్ కార్యాలయ ప్రాంగణంలో నియోజకవర్గ టిడిపి నాయకులు బాణాసంచ కాల్చి సోమవారం సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రాంత ప్రజలకు టిడిపి నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలన పట్ల ప్రజల మనోభావాలను వ్యక్తపరచారన్నారు. మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కోమటినేని శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు భీమనేని వందనాదేవి, గంగూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
పార్ధసారధిగా లక్ష్మీనృసింహుడు
మంగళగిరి, మార్చి 20: శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఆస్థాన అలంకారోత్సవాల్లో సోమవారం రాత్రి ఆలయ ఆస్థాన మండపంలో స్వామివారికి పార్ధసారధి అలంకారం చేశారు. ఈ అలంకారంలో దర్శనమిచ్చిన స్వామివారిని నేత్రపర్వంగా దర్శించుకున్నారు. కైంకర్యపరులుగా లంకా నాగేశ్వరరావు, ఆస్థాన కైంకర్యపరులుగా పచ్చళ్ల సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు. ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు పర్యవేక్షించారు.