గుంటూరు

డ్వాక్రా రుణాలకు బ్యాంకు బీమాతో ముడిపెట్టడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మార్చి 27: అచ్చంపేట ఎస్‌బిఐలో జీవితబీమా చెల్లిస్తేనే డ్వాక్రా సంఘాలకు నూతనంగా రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకు అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ డ్వాక్రా సంఘాల మహిళలు చేసిన ఆరోపణలపై డిఆర్‌డిఎ పిడి ఎస్‌కె అబీబ్‌బాషా సోమవారం బ్యాంకు, వెలుగు కార్యాలయాల్లో విచారణ నిర్వహించారు. మహిళలకు ఇచ్చే లింకేజీ రుణాలకూ బ్యాంకు బీమాలకు లింకు పెట్టవద్దంటూ స్పష్టంచేశారు. మండలంలో బ్యాంకు లింకేజీ రుణాలు 9.88 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే మండలంలో 237 గ్రూపులకు 7.13 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. జిల్లాలో 950 కోట్ల రూపాయల రుణాలను అందించేలా కృషి చేస్తున్నామన్నారు. స్ర్తి నిధి మహిళలకు ప్రత్యేకించిన బ్యాంక్ అన్నారు. వ్యక్తిగత రుణాలపై బకాయిలు ఉంటే రుణాలు నిలిపివేయబడతాయని, ఇలాంటి రుణాలు 200 కోట్ల రూపాయల మేర నిలిచిపోయాయని తెలిపారు. స్ర్తి నిధి రుణాలు అలాకాదని, రుణం కావాలని కోరిన 24 గంటల్లోపే రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తామన్నారు. ఇలాంటి రుణాలు మండలంలో కోటి రూపాయల వరకు అందిస్తామని, ఇప్పటికే 80 లక్షల రూపాయల వరకు మహిళా గ్రూపులకు ఇచ్చామన్నారు. ఏప్రిల్‌లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కలెక్టర్ ఆదేశాలతో స్ర్తి నిధి ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకునే వారికి ముందస్తుగా 12 వేల రూపాయల చొప్పున జిల్లాకు 2 కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తున్నామన్నారు. ఇక్కడ 8 గ్రామ పంచాయతీలకు 40 లక్షల రూపాయల మేర ఖర్చుచేశామన్నారు. పిడి వెంట ఎస్‌బిఐ మేనేజర్ శివప్రసాద్, ఎపిఎం సాంబశివరావు, ఇతర అధికారులు ఉన్నారు.
మంగళగిరి పిఎస్ ఎదుట వైఎస్‌ఆర్‌సిపి నేతల హైడ్రామా
మంగళగిరి, మార్చి 27: ఐపిఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పట్ల ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్నలు విజయవాడలో దౌర్జన్యం చేసిన ఘటనకు నిరసనగా అసెంబ్లీ గేటు వద్ద సోమవారం నల్లదుస్తులు ధరించి బైఠాయించిన వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్‌ఆర్‌సిపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. శాసనసభ్యులను అవమానిస్తున్న పోలీసుజులుం నశించాలని నినాదాలు చేశారు. పోలీసులు ఎంతసేపటికీ గేట్లు తెరవకపోవడంతో సహనం నశించిన గుంటూరు ఎమ్మెల్యే ముస్త్ఫా గేటు ఎక్కి లోపలికి దిగారు. ఆ తరువాత కొద్దిసేపటికి పోలీసులు గేట్లు తెరిచి శాసనసభ్యులను లోనికి అనుమతించారు. అనంతరం భాస్కరరెడ్డి సుమారు 4.50 గంటలకు అసెంబ్లీకి చేరుకుని శాసనసభ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ చేయని తప్పుకు తనను జైలుపాలు చేశారని, ఐపిఎస్ అధికారిని, ఆయన గన్‌మెన్‌ను భౌతికంగా మానసికంగా హింసించిన టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై కేసునమోదు చేయకపోవటం పట్ల తాను శాంతియుతంగా నిరసన తెలిపానన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ తనను కలవనీయకుండా గేటు బైటే ఆపడాన్ని భాస్కరరెడ్డి తప్పుపట్టారు.