గుంటూరు

సిఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎస్‌పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 14: రాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద జరిగే సిఎం సభ ఏర్పాట్లను జిల్లా రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్ ఆదివారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభ జరిగే ప్రదేశాలతో పాటు పార్కింగ్ ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు. అలాగే సభ బందోబస్తుకు హాజరయ్యే సిబ్బందికి పలు సూచనలు చేశారు. సభకు దేశ విదేశాల నుండి పారిశ్రామిక, వ్యాపారవేత్తలు హాజరు కానున్న దృష్ట్యా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 750 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండ వేడిమి అధికంగా ఉన్న దృష్ట్యా టెంట్లు ఏర్పాటు చేసి, మంచినీరు, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సభ జరిగే ఉద్దండరాయునిపాలెం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
దొంగల పట్ల అప్రమత్తంగా మెలగాలి
పెదకూరపాడు, మే 14: మండలాల్లో సంచరిస్తున్న దొంగల పట్ల అప్రమత్తంగా మెలగాలని పెదకూరపాడు ఎస్‌ఐ గవిని నాగేశ్వరరావు తెలిపారు. పెదకూరపాడులో ఆదివారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఇటీవల నియోజకవర్గంలోని అచ్చంపేట, క్రోసూరు మండలాల్లో దొంగల సంచారం అధికమైందని, కొత్తవ్యక్తుల పట్ల ఆచితూచి వ్యవహరించాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
గ్రామస్థుల రాకతో గేదెల దొంగలు పరార్..
మండల పరిధిలోని గారపాడు గ్రామంలో గత రాత్రి గేదెల అపహరణకు ప్రయత్నించిన దొంగలు గ్రామస్థుల రాకతో పరారయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గేదెలను గ్రామంలోనే నిలుపుదల చేసి పెదకూరపాడు పోలీసులకు సమాచారం అందించారు. సర్పంచ్ గణేష్ మాధవరావు, ఎంపిటిసి కొండమీది వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి గోలి యలమంద తదితరులు మాట్లాడుతూ గేదెలు పోయిన వారు సంప్రదించవచ్చని తెలిపారు.

కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి
ఈపూరు, మే 14: టిడిపి కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకోవాలని మండల టిడిపి అధ్యక్షుడు రాపర్ల జగ్గారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన ఈపూరులోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో టిడిపి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారావు మాట్లాడుతూ ప్రతినెలా 9వ తేదీన గ్రామ, మండల స్థాయి సమావేశాలు జరుపుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పనులు, మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలు, రోడ్ల బిల్లులు త్వరగా మంజూరు అయ్యేవిధంగా చూడాలని ఏకగ్రీవంగా సమావేశంలో తీర్మానించారు. ఈపూరు నుండి గోగువారిపాలెం, చిట్టాపురం, ముప్పాళ్ల మీదుగా ఇనిమెళ్ల, బొమ్మరాజుపల్లి రోడ్డుకు 3.50 కోట్లు, సుమారు 55 నూతన శ్మశాన వాటికల కోసం 3.80 కోట్ల రూపాయలు మంజూరు చేయించినందుకు స్థానిక ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోళ్లు, మిర్చియార్డులో రైతులకు 1500 రూపాయలను అదనంగా అందించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే మహానాడుకు కార్యకర్తలంతా తరలివెళ్లడానికి సంసిద్ధులు కావాలని ఆయన కోరారు. సమావేశంలో పిడతల హనుమయ్య, ముండ్రు రామకృష్ణ, గోగుల సుబ్బయ్య, చాపల మల్లయ్య, జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సైదులు, శ్రీనివాసరెడ్డి, బుజ్జి, ఆయా గ్రామాల టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.