గుంటూరు

త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 20: జిల్లాలో మిగిలిన నామినేటెడ్ పదవులను త్వరలో భర్తీచేస్తామని ఇందుకు పేర్లు సిద్ధం చేయాలని ఇన్‌చార్జి మంత్రి చింత కాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన మార్కెట్ యార్డు పదవులకు కూడా పాలకవర్గాలను ఎంపిక చేస్తామని చెప్పారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నెరవేర్చిన హామీలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నాయకులను కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ ఆరోపణలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో అమలు జరిగేలా ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. పేదల పక్కా గృహాల నిర్మాణంలో లబ్దిదారులకు బిల్లులు సత్వరమే చెల్లించి నిర్మాణాలు సత్వరమే పూర్తిచేయాలని గృహనిర్మాణశాఖను సమావేశం కోరింది. జిల్లాలో రేషన్ కార్డులు మంజూరైన వారికి వెంటనే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నీరు-చెట్టు- ప్రగతి కింది గత ఏడాది కోటి రూపాయల మేరకు అభివృద్ధి జరిగిందని ఈ ఏడాది ప్రభుత్వ నిబంధనల కారణంగా వెనుకబడినట్లు పలువురు సమావేశం దృష్టికి తెచ్చారు. పంచాయతీ పరిధిలోని తాగునీటి చెరువులు, మైనర్ ఇరిగేషన్ చెరువులన్నింటికీ నిధులు మంజూరుచేసి జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని సమావేశం తీర్మానించింది. గతంలో ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు అందని గ్రామాలకు వెంటనే మంజూరు చేయాలని గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబును సమావేశం కోరింది. జిల్లాలో నకిలీ విత్తన విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సమావేశం విజ్ఞప్తి చేసింది. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సమావేశంలో సమావేశంలో పార్టీ పరిశీలకులు చలమలశెట్టి రామానుజయ, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, రావెల కిషోర్‌బాబు, కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీలు ఎఎస్ రామకృష్ణ, అన్నం సతీష్ ప్రభాకర్, డొక్కా మాణిక్యవరప్రసాద్, మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, మాజీమంత్రులు శనక్కాయల అరుణ, జెఆర్ పుష్పరాజ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, మాకినేని పెదరత్తయ్య, బోనబోయిన శ్రీనివాసయాదవ్, చందు సాంబశివరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఏ తల్లి నినుక్నదో!
జిజిహెచ్‌లో కలకలం
గుంటూరు, జూన్ 20: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 20 రోజుల వయస్సు ఉన్న ఓ పసికందును ఓ తల్లి వదిలేసి వెళ్లింది. మంగళవారం ఉదయం 11.30 ప్రాంతంలో క్యాన్సర్ వార్డు సమీపంలో పసికందు ఏడుపు విన్న అటుగా వెళ్తున్న వ్యక్తి తక్షణం పోలీసు అవుట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆర్‌ఎంఒకు సమాచారం అందించారు. ఆర్‌ఎంఒ పిల్లల వార్డు నర్సులతో కలిసి వచ్చి పసికందును చేరదీసి వార్డుకు తరలించారు. వైద్య సేవలు అందించడంతో పసికందు తెప్పరిల్లింది. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఎవరు వదిలి వెళ్లారు, ఎందుకు వదిలివెళ్లారు, ఆసుపత్రిలోనే ఉంటూ వదిలి వెళ్లారా, బయటి నుంచి తీసుకువచ్చి ఇక్కడ వదిలి వెళ్లారా అనేది సిసి టివి ఫుటేజీతో పరిశీలిస్తామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే రోజులు నిండని ఆడ శిశువును వదిలి వెళ్లడంపై ఆసుపత్రి వర్గాలతో పాటు అక్కడివారంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు భరోసా!
* ఏడు పంటలకు బీమా * ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
* వ్యవసాయ శాఖ జెడి కృపాదాస్

గుంటూరు, జూన్ 20: ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంటలు కోల్పోయే రైతాంగానికి కేంద్రప్రభుత్వం భరోసా కల్పించింది. ఇందులో భాగంగా ఏడు పంటలకు బీమా వర్తింపజేసింది. వచ్చే నెల 31వ తేదీలోగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు విడివి కృపాదాస్ మంగళవారం మీడియాకు వివరించారు. ఉపద్రవాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతుకు సంభవించే పంటనష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పిఎం ఎఫ్‌బిఐ అమలుకు రాష్ట్రప్రభుత్వం ఏడు పంటలకు బీమా వర్తింపజేస్తూ జీవో 49ను విడుదల చేసిందని తెలిపారు. జిల్లాకు అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా రైతు ప్రీమియం భారాన్ని అతితక్కువగా నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రామాన్ని లేక మండలాన్ని యూనిట్‌గా తీసుకుని పంట విస్తీర్ణం ఆధారంగా ఇన్సూరెన్స్ యూనిట్‌గా పరిగణిస్తామన్నారు. ఇన్సూరెన్స్ యూనిట్ల పరిధిలో నిర్వహించే పంటకోత, ప్రయోగంలో వచ్చే సరాసరి దిగుబడుల ఆధారంగా నష్టపరిహారాన్ని లెక్కిస్తారని ఆయన వివరించారు. ఫసల్ బీమా యోజన పథకం కింద వరికి ఎకరానికి 28,500 రూపాయల బీమా చెల్లింపు జరుగుతుందని ఇందుకుగాను పంటపై రుణం పొందని వారు ఎకరానికి 570 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. కందికి ఎకరానికి 16 వేలు బీమా మొత్తం కాగా 320 రూపాయలు చెల్లించాల్సి ఉంది. మినుముకు 9 వేలకు గాను 180, ఆముదం 10 వేలకు గాను 200, పసుపు 80 వేలకు గాను 2,400, చెరకు (ప్లాంట్)కు 55 వేలకు గాను 1650, చెరకు (రెడ్)కు 40 వేలకు గాను 1200 రూపాయలను వచ్చే నెలాఖరులోగా చెల్లించాలన్నారు. వాతావరణ పంటల బీమా పథకం కింద పత్తికి ఎకరానికి 35 వేల రూపాయలు లభిస్తాయని, ఇందుకు ప్రీమియం సొమ్ము 1750గా నిర్ణయించడమైందన్నారు. మిర్చికి ఎకరానికి 55 వేలు బీమా చెల్లిస్తారని, ఇందుకు 2,750 రూపాయలు ఎకరానికి రైతులు చెల్లించాలన్నారు. ఈ పథకం కింద వాతావరణంలో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకుంటారు. వాతావరణ నివేదికల ఆధారంగా నష్టపరిహారాన్ని అందిస్తారు. వర్షపాతం, లోటు వర్షపాతం, అధిక వర్షపాతం, అకాల వర్షాలు, డ్రైస్‌స్పెల్స్, టెంపరేచర్, హై టెంపరేచర్, హ్యుమిడిటి, గాలివేగాన్ని బట్టి పంటల నష్టాన్ని అంచనా వేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

త్వరితగతిన ‘గ్రీనరీ’ పూర్తిచేయాలి
* మున్సిపల్ కమిషనర్ అనూరాధ
గుంటూరు, జూన్ 20: నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన గ్రీనరీ పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ పేర్కొన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో అర్బన్ గ్రీనరీ కార్పొరేషన్ అధికారులతో నగరంలో గ్రీనరీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లచెరువు, గుజ్జనగుండ్ల, బృందావన గార్డెన్స్ వాకింగ్ ట్రాక్‌లతో పాటు కొరిటెపాడు, ఆర్టీసీ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీల్లోని పార్కుల గ్రీనరీ పనులు నత్తనడకను తలపిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. అర్బన్ గ్రీనరీ కార్పొరేషన్, అమృత్ పథకం కింద నిధులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రీనరీ అభివృద్ధికి చేపట్టిన పనులను కాంట్రాక్టు తీసుకున్న వారు త్వరితగతిన పనులు పూర్తిచేసేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలోని వివిధ జంక్షన్లు, డివైడర్ల వద్ద పార్కుల సిబ్బందికి విధులు కేటాయించాలని సూచించారు. అర్బన్ గ్రీనరీ కార్పొరేషన్ ఎండి ఎస్ చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ గుంటూరు నగరం రాష్ట్ర రాజధానిలో భాగమని, ఈ దృష్ట్యా గ్రీనరీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నగరంలో మొక్కలు నాటే కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నామని వాటిని సంరక్షించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో కార్పొరేషన్ జోనల్ మేనేజర్ వై రామారావు, నగరపాలక సంస్థ ఎస్‌ఇ డి మరియన్న, ఇఇ వెంకట్రావ్, పార్కుల సూపర్‌వైజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

‘ఉపాధి’ పనుల్లో అవకతవకలు సహించం
* స్పీకర్ కోడెల శివప్రసాదరావు హెచ్చరిక
సత్తెనపల్లి, జూన్ 20: గ్రామాల్లో ఉపాధి కూలీలతో పనులు సక్రమంగా చేయించండి, రాజకీయాలు చేస్తే ఇంటికి పంపుతామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. స్థానిక కాకతీయ కళ్యాణ మండపంలో సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయిలో ఉపాధిహామీ పనులపై మంగళవారంనాడు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డ్వామా పిడి పులి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. కోడెల తన ప్రసంగంలో గ్రామాలను అభివృద్ధి చేసుకొనేందుకు ఉపాధిహామీ పధకం ఒక వరమని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న ఆపాధి పనులకు అనుగుణంగా వున్న 12 శాఖల పనితీరుపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అంగన్‌వాడి సెంటర్లను నిర్వహిస్తుందని, పిల్లకు ఇచ్చే ఆహారాన్ని అమ్ముకుంటున్నారు. వారికి సక్రమంగా ఆహారం ఎక్కడ పెడుతున్నారో చెప్పండి తేడాచేస్తే తేడాగానే వుంటుందని ఆ తరువాత మీ ఇష్టమని హెచ్చరించారు. నకరికల్లు మండలంలో నిర్మించిన ఇంకుడు గుంతలకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని ఎంపిపి లక్ష్మీబాయ్ భర్త అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కోడెల స్పందిస్తూ వీటిపై విచారణ జరిపి వారికి డబ్బులు వచ్చేలా చూడాలని పిడి శ్రీనివాసును ఆదేశించారు. మండలంలో అత్యధిక సంఖ్యలో కూలీలకు పనులు కల్పించిన మండలంగా రాజుపాలెం మండలం నిలిచిందని సత్తెనపల్లి మండలం చివరిస్థానింలో వుందని పిడి శ్రీనివాసులు వివరించారు. మొత్తంమీద మూడు గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో కోడెల ఉపాధిహామీ పధకంపై పూర్తిస్ధాయిలో సమీక్షించారు. అనంతరం రంజాన్ తోఫా, చంద్రన్న బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, ధూళిపాళ్ళ బ్యాంకు చైర్మన్ నరిశేటి గురవయ్య, ఎంపిపిలు బొర్రా కోటేశ్వరరావు, లక్ష్మీబాయ్, ఉమాదేవి, నర్రాబాబూరావు, పార్టీ అద్యక్షులు చౌటా శ్రీనివాసరావు, అంచుల నరసింహారావు, నల్లబోతు పాపారావు, మక్కపాటా రామచంద్రారవు, యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఎడి ఎ సిహెచ్ రవికుమార్, కౌన్సిలర్లు తోట అంబిక, బచ్చుమనోహర్, నాయకులు సయ్యద్ పెద కరిముల్లా, పూజల చినవెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల అభ్యున్నతికి టిడిపి కృషి
గుంటూరు, జూన్ 20: రాజకీయంగా, ఆర్థికంగా ముస్లింలు ఎదిగేందుకు ప్రభుత్వం చేపట్టే లక్షలాది రూపాయల పనుల్లో 25 శాతం పనులను ముస్లిం చేతివృత్తిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గుజ్జనగుండ్లలోని బొడ్డురాయి సెంటర్‌లో గుజ్జనగుండ్ల ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే మోదుగుల చీరలు, రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. కార్యక్రమానికి టిడిపి అర్బన్ డైరెక్టర్ షేక్ ఖాదర్‌బుడే అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలతో పోల్చుకుంటే ముస్లిం కమ్యూనిటీలో పేదవారు అధికంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేద ముస్లిం కుటుంబాల వారికి దుల్హాన్ పథకం కింద 50 వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేస్తుందని దీనిని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో రాష్టస్థ్రాయిలోనే అతిపెద్ద మదర్సాను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, సిఎం చేతుల మీదుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్‌బుడే, కార్యదర్శి హాజీ హుస్సేన్ సాహెబ్, షేక్ మీరావలి, షేక్ అబ్బాస్ సాహెబ్, షేక్ సుభాని ముతవల్లి, షేక్ బాబు, షేక్ మస్తాన్‌వలి, పార్టీ నాయకులు పులి పృధ్విరాజు, వజ్జా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల సాకుతో అర్హులకు అన్యాయం
*వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు, జూన్ 20: ఎన్‌టి ఆర్ హౌసింగ్ పథకానికి పొంతన లేని నిబంధన చూపుతూ అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు అర్బన్ పరిధిలో 11,808 ఇళ్లు నిర్మించబోతున్నామంటూ 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నల్లకుంటలో ఫౌండేషన్ వేసిన దగ్గర నుండి ప్రచార హోర్డింగ్‌లతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 15 నెలల తర్వాత 1300 ఇళ్లకు మాత్రమే నిబంధనల జల్లెడలో వడపోసి మంజూరు చేశారని అసంతృప్తి వ్యక్తంచేశారు. సొంతంగా ల్యాండ్‌లైన్ ఫోన్ కలిగి ఉండి, మోటారు సైకిల్, ఆటో, కార్లకు యజమాని అయిన, రిఫ్రిజిరేటర్ కలిగియున్న సాకుతో ఎన్‌టిఆర్ హౌసింగ్ పథకానికి అనర్హులుగా గుర్తించడం శోచనీయమన్నారు. దివంగత వైఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి రాష్టవ్య్రాప్తంగా 45 లక్షల ఇళ్లు కట్టించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేశారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, మేడా సాంబశివరావు, మంత్రి మహానంది, పల్లపు మహేష్, ఆర్ కోటేశ్వరరావు, సిద్ధయ్య, పల్లపు దుర్గాప్రసాద్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు
* ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు

గుంటూరు, జూన్ 20: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివని, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర అర్ అండ్ బి శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావులు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం కేటాయించని విధంగా రాష్టబ్రడ్జెట్‌లో వారికి సంక్షేమ ఫలాలను చేరువ చేయాలని 840 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. అలాగే రాష్టవ్య్రాప్తంగా షాదీఖానాల నిర్మాణాలు, విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు 15 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. తొలుత జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రులతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎఎస్ రామకృష్ణ, ఎంపి గల్లా జయదేవ్, కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ జాని, జెసి కృత్తికాశుక్లా, అదనపు జెసి ముంగా వెంకటేశ్వరరావు, జెడ్పీ సిఇఒ వెంకట సుబ్బయ్య, టిడిసి నాయకులు మద్దాళి గిరిధర్, షేక్ మీరావలి, గౌస్ పాల్గొన్నారు.