గుంటూరు

మహిళల వాలీబాల్ టోర్నీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, సెప్టెంబర్ 21: ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల వాలీబాల్ (మహిళల) టోర్నమెంట్ 2017ను మండల పరిధిలోని లాం చలపతి ఫార్మసీ కళాశాలలో ఎఎన్‌యు రెక్టార్ ప్రొఫెసర్ కెఅర్‌ఎస్ సాంబశివరావు ముఖ్య అతిధిగా గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ క్రీడల వలన మానసిక ఉల్లాసంతోపాటు ఒత్తిడి దూరమై బలమైన దేహదారుడ్యం పొందవచ్చునన్నారు. ఎన్‌యు ఫిజికల్ ఎడ్యుకేషన్ అధికారి డాక్టర్ సి జాన్సన్ మాట్లాడుతూ ఆటలు జీవితంలో ముఖ్యమైన భాగమని క్రీడల ద్వారా జ్ఞానపక శక్తి, చురుకుదనం, ఏకాగ్రత, ఫిజికల్ ఫిట్‌నెస్ పెరుగుతాయని చెప్పారు. ఈ టోర్నమెంట్ 12 జట్లు తలపడ్డాయని అన్నారు. అనంతరం అతిథులకు జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో చలపతి విద్యాసంస్థల అధిపతి వైవి ఆంజనేయులు, ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు, తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
అమరావతి, సెప్టెంబర్ 21: పంచారామ క్షేత్రాల్లో అగ్రగామియైన అమరావతిలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైనాయి. స్థానిక అమరేశ్వరాలయంలో తెల్లవారుజామునే బాలచాముండికా అమ్మవారిని బాలత్రిపుర సుందరిదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే అమ్మవారి మండపంలో ఉభయదాతలచే లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వేడుకలను ఇఒ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. అలాగే స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 24వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఈచర్ల బాలాజీ, అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకం, నిత్య హోమములు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బాలత్రిపురసుందరిదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు లలితా సహస్రపారాయణ, కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక వడియరాజుల కాలనీలో ఆదిశక్తి యువసేన ఆధ్వర్యంలో 3వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జగన్మాత కనకదుర్గాదేవి భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి మేళతాళాలతో కలశాల ఊరేగింపుతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి పొంగళ్లు ఏర్పాటుచేసి భక్తులకు నైవేద్యం ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ లలితాదేవి అమ్మవారి దేవస్థానంలో, షిరిడిసాయి, పర్తిసాయి కపోతేశ్వర ధ్యానమందిరంలో కూడా అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.