గుంటూరు

హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 24: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈనెల 25వ తేదీ నుండి హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించవద్దని బంకుల యజమానులకు సూచిస్తూ నోటీసులు జారీచేసినట్లు జిల్లా అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు తెలిపారు. ఆదివారం ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నారని, ఇందుకు హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

పుష్పశయ్యపై కనువిందు చేసిన అఖిలాండేశ్వరి

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 24: బెంగుళూరు నుంచే కాకుండా తూర్పు గోదావరి కడియం తదితర ప్రాంతాల నుండి తెప్పించిన సుగంధ పరిమళ భరిత పుష్పాలతో అందంగా, చందంగా, రమణీయంగా అఖిలాండేశ్వరిని పుష్పశయ్యపై అలంకరించి అశేష భక్తజనానికి కనువిందు చేశారు. శ్రీదేవీ ఆధ్యాత్మిక తత్వాన్ని ఆవిష్కరిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నాటికి నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని ముఖ్య అమ్మవారి ఆలయాలు, దేవస్థానాలు, మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆర్ అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 96వ శ్రీమద్దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పుష్పశయ్యపై అలంకరించి భక్తజనం కనురెప్ప ఆర్పకుండా చేశారు. ‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే’ అంటూ సకల ప్రాణకోటికి ఆకలిదప్పులను తీర్చి క్షుద్బాదలేకుండా చేసే శక్తి స్వరూపిణి అయిన అన్నపూర్ణ భక్తులకు నేనున్నానంటూ అభయమిచ్చింది. అరండల్‌పేట అష్టలక్ష్మీ మందిరం, సిద్దార్ధనగర్ కనకమహాలక్ష్మి దేవాలం, ప్రధాన ఆలయాల్లో శ్రీఅన్నపూర్ణదేవిగా, బృందావన గార్డెన్స్ వెంకన్న ఆలయంలో శ్రీ గాయత్రీదేవిగా, మల్లిఖార్జునపేట భ్రమరాంబ దేవస్థానంలో శ్రీ కన్యకా పరమేశ్వరిదేవిగా వికాస్‌నగర్ సాయిమందిరంలో శ్రీ కాళికాదేవిగా, సంపత్‌నగర్ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో శ్రీ కూష్మాండ, మారుతీనగర్ మారుతిక్షేత్రంలో శ్రీ కాళికాదేవి తదితర విభిన్న అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చింది. శాస్త్రోక్తంగా పూజలు, కుంకుమార్చనలు, హోమాలను లోకకళ్యాణార్ధం నిర్వహించారు.