గుంటూరు

ఈ-ఫైలింగ్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 25: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ-ఫైలింగ్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మీకోసం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈఫైలింగ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారని, తదునుగుణంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈఫైలింగ్ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి పలు సమస్యలతో వచ్చిన వారి నుండి కలెక్టర్ వినతులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించి పరిష్కార వేదిక అర్జీలు, మీకోసం అర్జీలు సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు కృషిచేయాలని, అలర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఖచ్చితంగా అమలు చేసి, ఎప్పటికప్పుడు అర్జీల పరిష్కారానికి కృషిచేయాలని స్పష్టంచేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈనెల 15వ తేదీ నుండి ప్రారంభమైన స్వచ్చతయే సేవ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా శ్రీ టెక్నాలజీ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో విద్యను మధ్యలోనే మానేసిన వారిని గుర్తించి, వృత్తి నైపుణ్యాన్ని కల్గించే విధంగా కృషి చేస్తుందని, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిమార్గంలో పయనించాలని సూచించారు. మీకోసం కార్యక్రమంలో జెసి కృత్తికాశుక్లా, డిఆర్‌ఒ కె నాగబాబు, జిల్లా పరిషత్ సిఇఒ నాగార్జున, జిల్లా అధికారులు పాల్గొన్నారు.