గుంటూరు

అగ్రి బాధితుల వివరాలు ఆన్‌లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 12: స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం బాండ్‌ల ఆన్‌లైన్, నమోదు కార్యక్రమాన్ని అమరావతి ఎస్‌హెచ్‌ఒ తక్కెళ్లపాటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రారంభించారు. అమరావతి మండల పరిధిలోని మునగోడు, తుళ్లూరు మండల పరిధిలోని హరిశ్చంధ్రపురం, తుళ్లూరు మండలం బోరుపాలెం బాధితుల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ నమోదు ప్రక్రియ ఈ నెల 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాండ్‌లను ఆన్‌లైన్ చేయించుకోని వారు ఇప్పటికైనా త్వరపడి నమోదు చేయించుకోవాలని సూచించారు. శుక్రవారం అమరావతి మండలం కర్లపూడి, తుళ్లూరు మండలం దొండపాడు గ్రామాలకు చెందిన బాధితులు నమోదు ప్రక్రియకు రావాలని సిఐ మురళీకృష్ణ కోరారు.

కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
తాడికొండ, అక్టోబర్ 12 బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కె. వెంకట సుబ్బయ్య ద్వజమెత్తా రు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రాజధాని ప్రాంత కార్యదర్శుల మహసభ గురువారం జరిగింది. ఈ మహాసభకు రాజధాని ప్రాంత కార్యదర్శి జివి రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఎఐటియుసిని విస్తరింపచేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న జిన్నింగ్ మిల్లులు మూతపడి వాటి స్థానంలో అపార్ట్‌మెంట్‌లు వెలుస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో అనేక కర్మాగారాలు రాజధానికి రానున్నాయని తెలిపారు. ప్రభుత్వ సంపదను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎఐటియుసి పోరాట ఫలితంగానే నేడు ముఖ్యమంత్రి చంద్రన్న బీమాను అమలు చేస్తున్నారని, తద్వారా 3.20కోట్ల మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సంపదకు సృష్టికర్తలు కార్మికులే అన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు మూడు వేల రూపాయల పెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన 400 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి తన అవసరాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. నవంబర్ 9, 10, 11 తేదీల్లో పార్లమెంట్ భవనం వద్ద లక్ష మందితో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. తొలుతగా ఎఐటియుసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిపిఐ రాజధాని ప్రాంత కార్యదర్శి పచ్చల సాంబశివరావు, జిల్లా కార్యదర్శి రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.