గుంటూరు

పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 12: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి, పొడి చెత్తలను విభజించే ప్రక్రియపై అంగన్‌వాడీలు, నగరపాలక సంస్థ అధికారులు పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ పేర్కొన్నారు. నగర పర్యటనలో భాగంగా గురువారం స్థానిక కార్మికుల కాలనీలో ఆమె పర్యటించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పారిశుద్ధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధులపై ఏ మేరకు అవగాహన కల్పించారనే అంశంపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అనూరాధ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణానికి దోమలు అధికంగా వృద్ధి చెందే అవకాశమున్నందున వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలన్నారు. గాంధీనగర్ 2వ లైనులో స్థానికులు మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే డ్రైన్లలోని మురుగునీరు రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం ఏటుకూరు రోడ్డులోని కుక్కల కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు నిర్వహిస్తున్న ప్రాంతాన్ని తనిఖీ చేశారు. నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని కుక్కలకు త్వరితగతిన శస్తచ్రికిత్సలు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. కుక్కలను పట్టుకునేందుకు అదనంగా బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌ఒ శోభారాణి, డిఇ మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు.

మంగళగిరిలో అగ్రి వివరాలు నమోదు
మంగళగిరి, అక్టోబర్ 12: పట్టణ పోలీసుస్టేషను ప్రాంగణంలో అగ్రిగోల్డ్ బాధితుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. పట్టణ పరిసర గ్రామాలకు చెందిన బాధితులు పోలీసు స్టేషనుకు తరలివచ్చి జాబితాలో పేర్లు చూసుకుని తమ వద్ద ఉన్న బాండ్లు, రశీదులు, ఆధార్‌కార్డులు చూపి నమోదు చేసుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ వైటి నాయుడు బాధితుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. పట్టణ సిఐ బొప్పన బ్రహ్మయ్య పర్యవేక్షణలో నాలుగు రిజిస్ట్రేషన్లు జరిపారు. సర్వర్ పనిచేయక పోవడంతో కేవలం నాలుగు మాత్రమే నమోదు చేశామని, వచ్చే నెల 11వ తేదీ వరకు బాధితుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని సిఐ బ్రహ్మయ్య తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో వచ్చిన బాధితుల పత్రాలు తొలుత పోలీసు సిబ్బంది పరిశీలించి కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు.

అగ్రి బాధితుల బాండ్ల వెరిఫికేషన్

పొన్నూరు, అక్టోబర్ 12: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ పొన్నూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో గురువారం ఆరంభమైంది. డిపాజిట్ చేసిన పొన్నూరు మండల పరిధిలోని ఖాతాదారులతో పాటు కాకుమాను, పెదనందిపాడు మండలాలకు చెందిన ఖాతాదారులు సైతం బాండ్ల వెరిఫికేషన్‌కు తరలివచ్చారు. పొన్నూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాల్లోని అగ్రిగోల్డ్ డిపాజిట్ హోల్డర్ల బాండ్ల పరిశీలనకు 3 వేర్వేరు కౌంటర్లలో 16 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. బాపట్ల డిఎస్‌పి గంగాధరరావు పర్యవేక్షణలో స్పెషల్ సిఐ నిసార్‌బాషా, పొన్నూరు సిఐలు సిహెచ్ సుబ్రహ్మణ్యం, కె కోటేశ్వరరావు, ఎస్‌ఐలు నేతృత్వంలో డాక్యుమెంట్ల పరిశీలన కొనసాగింది. పొన్నూరు ప్రాంతంలోని 2,500 మంది పై చిలుకు బాధితులు ఇప్పటికే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా, చేయించుకోని బాధితులు 2 వేల పై చిలుకు ఉన్నట్లు భోగట్టా.