గుంటూరు

‘ఈనామ్’పై నిమ్మ రైతుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, అక్టోబర్ 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 9 నుండి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనామ్ విధానం తప్పక అమలుచేయాలంటూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా నిమ్మరైతులు కొనసాగిస్తున్న రాస్తారోకోలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మంగళవారం రైతులను బుజ్జగిస్తూ అవగాహన కల్పించినా ఫలితం లేకపోయింది. వ్యాపారులు రైతుల వెనుక ఉండి చక్రం తిప్పుతూ రైతులను పరోక్షంగా రెచ్చగొడుతున్నారంటూ టిడిపి రైతు సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా టన్నులకొద్దీ నిమ్మకాయల నిల్వలు గురువారం కూడా క్రయ విక్రయాలు జరుగకుండా నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన దుగ్గిరాల పసుపుయార్డు, తెనాలి నిమ్మకాయల యార్డులో ఈనెల 9 నుండి ఈనామ్ విధానం ద్వారానే పసుపు, నిమ్మకాయల క్రయ విక్రయాలు తప్పక జరపాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ నుండి యార్డు కార్యదర్శి బాషాకు జీవో అందింది. దీంతో స్పందించిన ఆయన నిమ్మ రైతులకు ఈనామ్ విధానంగాపై అవగాహన సదస్సు నిర్వంచారు. అయితే రైతులు తమకు పాత విధానమే అమలు చేయాలని, ఈనామ్ వద్దంటూ అడ్డం తిరిగారు. స్పందించిన స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా గత మంగళవారం యార్డులో సమావేశపరిచి ఈనామ్ విధానం ద్వారా గిట్టుబాటు ధర లభించి వారికి ఆసరాగా నిలుస్తుందని దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి రైతులను సముదాయించారు. ఎమ్మెల్యే వద్ద అప్పటికి వౌనం వహించిన నిమ్మ రైతులు తిరిగి గురువారం ఒక్కసారిగా తెనాలి- గుంటూరు రహదారిపై ధర్నా, రాస్తారోకోలకు దిగారు. ఈనామ్ విధానంతో తమకు నష్టం జరుగుతుందని, పచ్చి వ్యాపారాలకు ఈ పద్ధతి సాధ్యంకాదని ఆందోళనకు దిగారు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిదులు ఎవరు చెప్పినా వినకుండా ఉద్యమాలకు దిగుతుండటంతో ఏమి చేయాలో అర్ధంగాక అధికారులు, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిదులు వౌనం వహించారు. సంఘటన సమాచారం అందుకున్న తెనాలి రూరల్ పోలీసులు సిఐలు యార్డువద్దకు చేరుకొని రైతులను శాంతింపచేసే ప్రయత్నంచేసి విఫలమయ్యారు. ఇదిలాఉండగా ఇదేరోజు జిల్లా రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు యార్డులో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తుండటంతో పోలీసులు బందోబస్తు పెంచారు. తుదకు కలెక్టర్‌తో విషయాన్ని చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కొద్దిసమయం కేటాయించాలని పోలీసు అధికారులు రైతులకు హామీ ఇవ్వటంతో ధర్నా, రాస్తారోకోలను విరమించారు.

చక్రం తిప్పుతున్న వ్యాపారులు
ఇదిలాఉండగా కొందరు వ్యాపారులు నిమ్మ రైతులు, కౌలు రైతులకు ముందుగానే అప్పులిచ్చి వారిచే ఈ విధమైన ఉద్యమాల నిర్వహణకు చక్రం తిప్పుతున్నారని టిడిపి రైతు సంఘ నాయకులు ఆరోపించారు. సాధారణ తూకంలో 2, 3 కిలోల నిమ్మకాయలు బస్తాలో ఉన్నప్పటికీ రైతులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారని, ఫలితంగా టన్ను నిమ్మకాయలు కొనుగోలు చేసిన రైతులకు సుమారుగా 20 నుండి 30 కేజీల వరకు నిమ్మకాయలు ఉచితంగావచ్చే అవకాశం ఉందని, ఈనామ్ విధానం ద్వారా ఖచ్చితమైన కాటా, గిట్టుబాటు ధర నిర్ణయాలు అన్నీ రైతుల ఇష్ట పూర్వకంగానే ఉంటాయని అందుకే కొందరు వ్యపారులు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు వ్యాపారులు ముందుగానే కౌలు రైతులకు కౌలు చెల్లించు నిమత్తం నగదు ముట్టజెప్పారని, ఈనామ్ విధానం ద్వారా సంబంధిత రైతుల సరుకు కొనుగోళ్ళు చేయమంటూ పరోక్షంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను రైతులు గమనించి ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ అమలు చేస్తున్న ఈనామ్ విధానాన్ని అర్ధం చేసుకుని, అంగీకరించి లబ్ధిపొందాలని పాలకపక్ష నేతలు సూచిస్తున్నారు.

పిఎంఎవైకు భూములు గుర్తించండి

* అధికారులకు జెసి కృత్తికాశుక్లా ఆదేశం

గుంటూరు, అక్టోబర్ 12: జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్లు నిర్మించే పథకానికి సంబంధించి అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించి అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కృత్తికాశుక్లా తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో భూమిని సేకరించే అంశంపై మున్సిపల్ కమిషనర్‌లు, ఆయా మండలాల తహశీల్దార్లు, టిట్కో ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృత్తికాశుక్లా మాట్లాడుతూ గుంటూరుకు సంబంధించి 100 ఎకరాలు కావాల్సి ఉండగా మొదటి విడతగా గోరంట్లలో 31 ఎకరాలు, చౌడవరంలో 7, అడవి తక్కెళ్లపాడులో 28 ఎకరాలు అందజేయాల్సిందిగా గుంటూరు తహశీల్దార్‌ను ఆదేశించారు. చిలకలూరిపేటలో 6.5 ఎకరాలు, సత్తెనపల్లిలో 7.5, రేపల్లెలో 1.5, పిడుగురాళ్లలో 10, మాచర్లలో 2, తాడేపల్లిలో 2.5 ఎకరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే సేకరించి ఉన్న నర్సరావుపేట, వినుకొండ, పొన్నూరు, మండలాల తహశీల్దార్లు రెండు రోజుల్లో భూమిని అప్పగించాలని కోరారు. మంగళగిరి 12 ఎకరాలు సేకరించాల్సి ఉండగా స్థలం దొరకనందున కొనుగోలుకు ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా తహశీల్దార్‌ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కోసం కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకుని త్వరితగతిన పనులు ప్రారంభించేలా తహశీల్దార్లు చూడాలని జెసి కృత్తికాశుక్లా కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ అనూరాధ, టిట్కో ఎస్‌ఇ సిహెచ్ కోటేశ్వరరావు, ఇఇ ఆదినారాయణరావు తదితరులు పాల్గొన్నారు.