గుంటూరు

వారసత్వ నగరంగా అమరావతి అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 28: అమరావతిని వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కాంతిలాల్‌దండే సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్‌తో పాటు పలు శాఖల అధికారులతో అమరావతి అభివృద్ధిపై సమీక్షించారు. అమరావతి వారసత్వ నగర సలహాదారు గల్లా అమరేశ్వర్ నగర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను కలెక్టర్ తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి వారసత్వ నగర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం
మంజూరు చేసిన 75 కోట్ల రూపాయలను హృదయ్ పథకం కింద అమరావతి పరిసరాల అభివృద్ధికి, ప్రసాద్ పథకం కింద అమరావతి దేవాలయ సంపూర్ణ అభివృద్ధికి నిధులు వెచ్చించాల్సి ఉందన్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 12 నుండి కృష్ణా పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అమరావతికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పుష్కర అభివృద్ధి పనులను కూడా చేపట్టాల్సి ఉందని చెప్పారు. అమరావతిలో తాగునీరు తదితర వౌలిక సదుపాయాల కల్పనకు డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసరావు, స్టెప్ సిఇఒ కృష్ణకపర్థి, మత్స్యశాఖ డిడి బలరామ్‌లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు మల్లిఖార్జునరావు, పర్యాటకశాఖ ఇఇ జి ఉమామహేశ్వరరావు, తహశీల్దార్ కె నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.