గుంటూరు

పోలీసింగ్‌లో ఆధునిక పరిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 20: పోలీసు.. పేరు వింటేనే సామాన్యులకు అదోరకమైన ఆందోళన.. అనేది ఆనాటి మాట.. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పోలీసుశాఖలో అమలు జరుగుతున్న నేర నియంత్రణ విధానాలు శాంతిభద్రతల అంశంలో ముందడుగులో ఉన్నాయి. ఐటి వినియోగంతో అపారమైన అనుభవం సాధించినప్పటికీ ప్రభుత్వపరంగా సంక్షేమంలో వెనుకబాటుతనం అనుభవిస్తున్నారనే చెప్పకతప్పదు. జిల్లా వ్యాప్తంగా అనేక సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలిగారు. రాజధాని నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అర్బన్, రూరల్ జిల్లాల పరిధిలో నేర నియంత్రణతో పాటు సంక్షేమానికి అనేక సంస్కరణను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్నారు. నగరంలో అనేక సైబర్ నేరాలను ఛేదించటంలో పోలీసు అధికారులు సఫలీకృతులయ్యారు. ఇటీవల జిల్లాలో బోరుబావిలో పడిన బాలుడ్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చటం పోలీసు సేవానిరతి పట్ల ప్రజల్లో విశ్వసనీయతను పెంచింది. నగరంలో దొంగతనాల నియంత్రణకు అన్‌లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంతో పాటు తరచు విద్యార్ధి దశ నుంచి నేరాలను నియంత్రించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అర్బన్ ఎస్‌పి విజయారావు, కింది స్థాయి అధికారులు సిబ్బంది నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. డ్యూటీలకు సంబంధించి వారాంతపు సెలవులు, కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించి సేవలందించే వీలు కలుగుతుందనేది పోలీసు ఉద్యోగుల ఆకాంక్ష.