గుంటూరు

ప్రైవేటు భూములకు హక్కు పత్రాల జారీకి నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 17: జిల్లాలోని మున్సిపాలిటీల్లో సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఇంకనూ ఇళ్లు మంజూరుకు దరఖాస్తు చేసుకోని పక్షంలో ఈనెల 20వ తేదీలోగా సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో ఆయా మున్సిపల్ కమిషనర్‌లు, వివిధ శాఖల అధికారులతో గృహ నిర్మాణాల పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి ‘సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు’ కార్యక్రమం కింద 12 మున్సిపాలిటీలకు 9,910 గృహాలు కేటాయించినట్లు తెలిపారు. స్థలం రిజిష్టరు కాబడి ఉండాలని, లేక పట్టా అయినా కలిగి ఉండాలని స్పష్టంచేశారు. లబ్ధిదారులకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉంటే చాలని, 12 మున్సిపాలిటీలతో పాటు నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుంటూరు నగరపాలక సంస్థతో పాటు మిగిలిన మున్సిపాలిటీలకు 39,172 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. 4 మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయని, 5 మున్సిపాలిటీల్లో స్థలాలు ఇచ్చినా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. భూ సేకరణ చేయాల్సిన మున్సిపాలిటీల్లో త్వరితగతిన ప్రక్రియ చేపట్టి రెండు మూడు రోజుల్లో పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ప్రైవేటు భూములకు హక్కు పత్రాలను జారీ చేయకూడదని స్పష్టంచేశారు. స్థలం రిజిష్టరు కాకపోయినా, పట్టా లేకపోయినా ఇల్లు మంజూరు చేయకూడదని, సొంత స్థలం ఉన్నదీ, లేనిదీ నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కృత్తికాశుక్లా, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాసరావు, ఏపి పట్టణ వౌళిక సదుపాయాల సంస్థ ఎస్‌ఇ ఎంసిహెచ్ కోటేశ్వరరావు, ఇఇ ఆదినారాయణ, ఆయా మండలాల తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్‌లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.