గుంటూరు

బాధితుల హక్కుల గురించి ప్రచారం నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 20: రాష్ట్రంలోని బాలల హక్కుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలకై తప్పనిసరిగా కృషి చేస్తామని, సంబంధిత చట్టాల అమలు, కార్యక్రమాల నిర్వహణ స్థితిగతులను లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గాంధీబాబు అన్నారు. హెల్ప్, విముక్తి బాధిత మహిళా సంఘం సంయుక్తంగా ఎక్‌పాట్ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్వహించిన రాష్టస్థ్రాయి బాలికలు, మహిళా బాధితుల సదస్సులో ఆయన ప్రసంగించారు. హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్ బిల్ ఆఫ్ రైట్స్ ప్రాముఖ్యత, దాని ఆవశ్యకతను వివరిస్తూ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా రాష్టస్థ్రాయి బాధిత బిల్ ఆఫ్ రైట్స్‌లో లైంగిక దోపిడీకి గురైన బాలలు, వారికి పునరావాసం, సామాజిక, ఆర్థిక పరమైన అంశాలు కూడా చేర్చడం జరిగిందని, వీటన్నింటినీ క్రోడీకరించి ఒకే చట్టం కిందకు తీసుకురావడం ద్వారా వారిని అన్ని విధాలుగా ఆదుకోవచ్చన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బాధిత బాలలు, మహిళలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు తగు కృషిచేస్తామన్నారు. ఎక్‌పాట్ ఇంటర్నేషనల్ దక్షిణాసియా దేశాల సమన్వయకర్త రజిబ్‌కుమార్ హోల్దార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో తమ సంస్థ పనిచేస్తోందన్నారు. ఆయా దేశాల్లో లైంగిక దోపిడీకి గురై బాలికలు, మహిళలకు అవసరమైన చట్టపరమైన, పునరావాసానికి కావాల్సిన చట్టాలు, కార్యక్రమాలపై బిల్ ఆఫ్ రైట్స్ ద్వారా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు కేసలి అప్పారావు, రాజేశ్వరమ్మ, పద్మలత, క్రిష్ణకుమార్, ప్రసాద్‌తో పాటు రోషన్‌కుమార్, సుఖజీవన్‌బాబు, సమీర్‌కుమార్, విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
మంగళగిరి, నవంబర్ 20: కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన జూనియర్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ 2017 మెన్ అండ్ ఉమెన్, మాస్టర్స్ పోటీల్లో జిల్లా లిఫ్టర్లు పతకాలు సాధించారని, వివరాలను పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు సోమవారం వెల్లడించారు. పురుషులు 53 కేజీల విభాగంలో మంగళగిరికి చెందిన పి భరత్ కుమార్ సిల్వర్ మెడల్, 59 కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన సిహెచ్ రమేష్ సిల్వర్ మెడల్, 66 కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన కెసిఎం శ్రీమన్నారాయణ , 74 కేజీల విభాగంలో చినకాకానికి చెందిన జి కృష్ణబాబు చతుర్ధ బహుమతిని, 105 కేజీల విభాగంలో బడేపురంకు చెందిన టి అఖిల్ సుమన్ బంగారు పతకాన్ని సాధించారు. మహిళా విభాగం 47 కేజీల విభాగంలో ఎస్‌కె కరిష్మా (వేజెండ్ల) చతుర్ధస్థానం, 52 కేజీల విభాగంలో మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ సిల్వర్ మెడల్, 63 కేజీల విభాగంలో ఎస్‌కె నగీనా బంగారు పతకాన్ని, 72 కేజీల విభాగంలో ఎం సలోమి బంగారు పతకాన్ని సాధించారు. మాస్టర్స్ 74 కేజీల విభాగంలో ఎస్‌కె నజీర్ (బాపట్ల) బంగారు పతకాన్ని, 93 కేజీల విభాగంలో పి భాస్కర్ (మంగళగిరి) సిల్వర్ మెడల్, 105 కేజీల విభాగంలో సత్తెనపల్లికి చెందిన ఆర్ నటరాజ్ సిల్వర్ మెడల్ సాధించారని పుల్లేశ్వరరావు తెలిపారు. విజేతలను పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహ్మద్ రఫి అభినందించారు. టీం కోచ్‌గా ఎస్‌కె సంధాని వ్యవహరించారు.