గుంటూరు

జాతీయ జూ.అథ్లెటిక్స్ చివరిరోజు విజేతలు వీరే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 20: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణంలో గత ఐదురోజులుగా జరుగుతున్న 33వ జాతీయస్ధాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల ఆఖరిరోజైన సోమవారం వివిధ క్రీడాంశాలలో విజయం సాధించిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. అండర్ 20 బాలుర విభాగంలో 10వేల మీటర్ల పరుగు అంశంలో మహారాష్టక్రు చెందిన కిషన్‌తాడ్వి ప్రధమ స్థానం సాధించగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్జున్‌కుమార్ ద్వితీయ, ఉత్తరాఖండ్‌కు చెందిన మోహాన్‌సైనీ తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 20 బాలికల విభాగంలో 3వేల మీటర్ల పరుగులో హార్యానాకు చెందిన కె ఎమ్ పూజ ప్రధమ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కవితా యాదవ్ ద్వితీయ, కేరళకు చెందిన బబితా తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 20 బాలికల విభాగంలో హ్యామర్‌త్రోలో పంజాబ్‌కు చెందిన మన్‌ప్రీత్‌కౌర్ ప్రధమ స్థానం సాధించగా, హార్యానాకు చెందిన షీతల్, బతేరీలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 18 బాలుర విభాగంలో 3వేల మీటర్ల పరుగు అంశంలో హార్యానాకు చెందిన గురుప్రీత్ ప్రధమ, తెలంగాణాకు చెందిన అవిదేష్‌కుమార్ ద్వితీయ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవినాష్ పాటిల్ తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 16 బాలికల విభాగంలో హైజంప్ అంశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖ్యాతిమాథూర్ ప్రధమ, తమిళనాడుకు చెందిన కెవినాఅశ్వినే ద్వితీయ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్సి తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 16 బాలుర విభాగంలో 200 మీటర్ల పరుగులో ఢిల్లీకి చెందిన నిషార్ అహ్మాద్ ప్రధమ, మహారాష్టక్రు చెందిన కరణ్ హెగిస్టే ద్వితీయ, కర్ణాటకకు చెందిన శశికాంత్ తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 18 బాలుర విభాగంలో 200 మీటర్ల పరుగు అంశంలో ఢిల్లీకి చెందిన అక్షయ్‌నైన్ ప్రధమ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రషీద్ ద్వితీయ, పంజాబ్‌కు చెందిన సాహిల్ తృతీయ స్థానాలలో నిలిచారు. అండర్ 18 బాలికల విభాగంలో 200 పరుగుపోటీలో కేరళకు చెందిన అన్సీ సోజన్ ప్రధమ స్థానం సాధించగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన రాజశ్రీ ప్రసాద్ ద్వితీయ, హార్యానాకు చెందిన కిరణ్ తృతీయస్థానం సాధించారు. అండర్ 20 బాలుర విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అకాష్‌కుమార్ ప్రధమ, మహారాష్టక్రు చెందిన రాహూల్ ద్వితీయ, పశ్చిమబెంగాల్‌కు చెందిన రాజల్ తృతీయ స్థానం సాధించారు. అండర్ 20 బాలుర విభాగంలో 400 మీటర్ల పరురు అంశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతీక్‌పాండే, గౌతమ్‌గుప్తాలు వరుసగా ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించగా, కేరళకు చెందిన రషీద్ తృతీయ స్థానాలు సాధించారు.
ఓవరాల్ ఛాంపియన్ హర్యానా
నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 20: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 16 నుండి జరుగుతున్న 33వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు సోమవారంతో ముగిసాయి. నాగార్జున వర్సిటీ క్రీడాప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లి రవీంద్ర, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, జవహర్, పత్తిపాటి పుల్లారావు పాల్గొని విజేతలకు బహుమతులు అందచేశారు. గత ఐదు రోజులుగా జరిగిన పోటీలలో హర్యానా జట్టు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలికలు, బాలుర అంశాలలో మొత్తం పోటీలలో 408 పాయింట్లతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని హర్యానా జట్టు అందుకుంది. బాలుర విభాగంలో 221 పాయింట్లతో ఉత్తరప్రదేశ్, హర్యానా జట్లు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకోగా, 76 పాయింట్లతో కేరళ జట్టు బాలికల విభాగంలో ఛాంపియన్‌షిప్ ట్రోపీకి అందుకుంది.