గుంటూరు

రోడ్లపై చెత్త వేస్తే షాపులు మూయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 14: ఇష్టారాజ్యంగా రోడ్లపై వ్యర్ధాలను పడవేస్తే షాపులను మూయిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ హెచ్చరించారు. నగర పర్యటనలో భాగంగా గురువారం కొల్లిశారద కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. ఈ క్రమంలో టీ షాపులు, ఇతర వ్యాపార సముదాయాల ముందు రోడ్లపై చెత్త, టీ కప్పులు పడవేసి ఉండటాన్ని గమనించిన కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. షాపుల ముందు డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసుకోవాలని, కాల్వల్లో, రోడ్లపై చెత్త వేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. అనంతరం నందివెలుగు రోడ్డులో డ్రైన్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఒక స్టచ్‌లో మాత్రమే పనులను జరుగుతుండటాన్ని గమనించి ఈఈని వివరణ అడిగి, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన భవనాల వ్యర్ధాలు రోడ్డుకు ఇరువైపులా కుప్పలుగా ఉండటాన్ని గమనించి వ్యర్ధాలు, మట్టికుప్పలను వెంటనే తొలగించాలన్నారు. పర్యటనలో కమిషనర్ అనూరాధ వెంట ఈఈ లక్ష్మయ్య, సిపి చక్రపాణి తదితర అధికారులు పాల్గొన్నారు.

పాముకాటుకు అంగన్‌వాడీ విద్యార్థి మృతి

తెనాలి, డిసెంబర్ 14: కొల్లిపరలో పాముకాటుకు అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న విద్యార్థి గురువారం మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలోని ముస్లింవాడకు చెందిన షేక్ షబ్బీర్ కుమారుడు చాంద్‌భాషా(4) స్థానిక కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్నాడు. గురువారం పలకతో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్ళిన బాషా తోటి పిల్లలతో అడుకుంటూ సమీపంలోని ఓ పుట్టలో చేయిపెట్టాడు. ఆ సమయంలో అతడిని పుట్టలోని పాము కాటువేసింది. విషయం తెలియని బాలుడు తోటి పిల్లలతో అడుకుంటూ అకస్మాత్తుగా పడిపోయాడు. సంఘటనను గ్రహించిన ఉపాధ్యాయులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయతే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుని తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.