గుంటూరు

చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 14: రాష్ట్రప్రభుత్వం పేద ప్రజలకు 500 రకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేందుకు చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రవేశపెడుతోందని, ఇదొక గొప్పవరమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రన్న మాల్స్‌లో వస్తువులు కొనుగోలు చేస్తే 4 శాతం నుండి 35 శాతం వరకు మార్కెట్ ధరల కన్నా తక్కువ రేటులో వస్తువులు అందుబాటులో ఉంటాయన్నారు. చౌకడిపోల్లో రేషన్‌బియ్యం తీసుకోవడానికి కొంతమంది సుముఖత వ్యక్తంచేయడం లేదని, ఇలాంటి మాల్స్ ద్వారా వారికి అవసరమైన వస్తువులను పల్లెల్లో సైతం కొనుగోలు చేయవచ్చన్నారు. తద్వారా డ్వాక్రా గ్రూపులు, డీలర్లకు కొంతమేర ఆదాయం సమకూరుతుందని, వినియోగదారులకు కూడా లబ్ధిచేకూరుతుందన్నారు. పోలవరం నిర్మాణంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ విషం కక్కుతూ రాష్ట్భ్రావృద్ధి అడ్డుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టులో గిరిజన నిర్వాసితులకు, ప్యాకేజీగా ఇచ్చే పరిహారం మాత్రమే పెరిగిందే తప్ప ప్రాజెక్టు మీద అదనంగా పెరిగిన భారమేమీ లేదన్నారు. జనవరిలో కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికోసం రానున్న మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి గండికొట్టి వారిని దోచుకుని తినడమే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేయలేదన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ కనెక్షన్ల సంఖ్య, పెన్షన్లు, రేషన్‌కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అనంతరం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల తన జన్మదిన కేక్ కట్ చేయగా, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయపాటి రంగారావు, చందు సాంబశివరావు, షేక్ లాల్‌వజీర్, కంచర్ల శివరామయ్య, పోతురాజు ఉమాదేవి, కసుకుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాసరావు, చంద్రగిరి ఏడుకొండలు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

అధ్లెటిక్స్‌లో రికార్డుల మోత

*హోరాహోరీగా సాగుతున్న అథ్లెటిక్స్

నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 14: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణంలో గత మూడురోజులుగా జరుగుతున్న 78వ అఖిలభారత అంతరవిశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపు కోసం క్రీడాకారులు నువ్వా, నేనా అన్నట్టు తలపడుతుండటంతో వర్సిటీ క్రీడాప్రాంగణమంతా కదనరంగాన్ని తలపిస్తుంది. మూడవరోజైన గురువారం మూడు న్యూమీట్ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల 110 మీటర్ల హార్డిల్స్ అంశంలో కలకత్తా యూనివర్సిటికీ చెందిన మైమూన్ పాలోజ్ నిర్దేశిత గమ్యాన్ని 14.19 నిమిషాలలో చేరుకుని, 2001లో మద్రాస్ యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ శ్రీధరన్ నెలకొల్పిన 14.20 నిమిషాల రికార్డును తిరగరాసి న్యూమీట్ రికార్డును నెలకొల్పాడు. పురుషుల 800 మీటర్ల పరుగులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఆమోజ్ జాకబ్ నిర్దేశిత గమ్యాన్ని 14.49 నిమిషాలలో చేరుకుని, 2001లో మహాత్మాగాంధీ వర్సిటీ క్రీడాకారుడు పిఎస్ ప్రిమెష్ నెలకొల్పిన 1.50 నిమిషాల రికార్డును తిరగరాసాడు. 3వేల మీటర్ల మహిళల స్టీప్లేఛేజ్ అంశంలో మాంగుళూరు వర్సిటీకి చెందిన చోహాన్‌జ్యోతి 10.36 నిమిషాలలో చేరుకుని, గతంలో లక్నో క్రీడాకారిణి విజయలక్ష్మి నెలకొల్పిన 10.43 నిమిషాల రికార్డును అధిగమించి సరికొత్త న్యూమీట్ రికార్డును నెలకొల్పింది. మహిళల 800 మీటర్ల పరుగులో నాగపూర్ ఆర్‌ఎస్‌టిఎమ్ వర్సిటీకి చెందిన వాగ్‌మారే ప్రధమ, అమ త్‌సర్ వర్సిటీకి చెందిన ట్వింకిల్ చౌదరి ద్వితీయ స్థానాలు సాధించారు. మహిళల జావెలిన్‌త్రో అంశంలో దేవీ అహాల్య వర్సిటీకి చెందిన పూనమ్ ప్రధమస్థానం సాధించగా, జైపూర్ వర్సిటీకి చెందిన సంజనాచౌదరి ద్వితీయస్థానం సాధించారు. పురుషుల లాంగ్‌జంప్‌లో మద్రాస్ వర్సిటీకి చెందిన పిఎస్‌విష్ణు ప్రధమ స్థానం సాధించగా, కాలికట్ వర్సిటీకి చెందిన మహ్మాద్ ఆలీ ద్వితీయ స్థానం సాధించారు.