గుంటూరు

అంతర్ వర్సిటీ అథ్లెటిక్స్ రికార్డులే రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, డిసెంబర్ 16: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణంలో గత ఐదురోజులుగా జరుగుతున్న 78వ అఖిలభారత అంతర విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ పోటీలలో ఐదవరోజైన శనివారం జరిగిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారి వివరాలను పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య పిపిఎస్ పాల్‌కుమార్ వెల్లడించారు. మహిళల 200 మీటర్ల పరుగులో మంగూళూరు వర్సిటీకి చెందిన వికె విస్మయ నిర్దేశిత గమ్యాన్ని 23.90 నిమిషాలలో చేరుకుని న్యూమీట్ రికార్డును నెలకొల్పగా, కాలికట్ యూనివర్సిటీకి చెందిన జిస్మా మాథ్యూస్ ద్వితీయస్థానం సాధించింది. మహిళల 4 ఇన్‌టు 400 మీటర్ల రిలే పరుగులో మహాత్మాగాంధీ వర్సిటీకి చెందిన క్రీడాకారులు నిర్దేశిత గమ్యాన్ని 3.40 నిమిషాలలో చేరుకుని న్యూమీట్ రికార్డు నెలకొల్పగా, కాలికట్ వర్సిటీకి చెందిన క్రీడాకారులు ద్వితీయస్థానం సాధించారు. పురుషుల 1500 మీటర్ల పరుగులో పంజాబ్ వర్సిటీకి చెందిన సచ్చీలాల్ పాటిల్ నిర్దేశిత గమ్యాన్ని 3.50 నిమిషాలలో చేరుకుని న్యూమీట్ రికార్డును నెలకొల్పగా, కలకత్తా వర్సిటీకి చెందిన శశిభూషణ్‌సింగ్ ద్వితీయస్ధానం సాధించారు. మహిళల 1500 పరుగులో కాలికట్ వర్సిటీకి చెందిన పియు చిత్రా నిర్దేశిత గమ్యాన్ని 4.24 నిమిషాల చేరుకుని న్యూమీట్ రికార్డును నెలకొల్పగా, పంజాబ్ వర్సిటీకి చెందిన హార్మిలాన్ బైన్స్ ద్వితీయస్థానం సాధించారు. పురుషుల 200 మీటర్ల పరుగులో మాంగుళూరు వర్సిటీకి చెందిన ఎలకిమాదాసన్ నిర్దేశిత గమ్యాన్ని 20.92 నిమిషాలలో చేరుకుని న్యూమీట్ రికార్డును నెలకొల్పగా, సావిత్రిభాయిఫూలే వర్సిటీకి చెందిన షిండే శశాంక్ ద్వితీయస్థానం సాధించారు. మహిళల హాఫ్ మారథాన్ పోటీలలో కురుక్షేత్ర వర్సిటీకి చెందిన వర్షాదేవి ప్రధమ, దీన్‌దయాల్ వర్సిటీకి చెందిన డింపుల్‌సింగ్ ద్వితీయస్థానం సాధించారు. పురుషుల హామర్‌త్రో అంశంలో పంజాబ్ వర్సిటీకి చెందిన తన్వీర్‌సింగ్ ప్రధమ, సంత్‌బాబా బాగ్‌సింగ్ వర్సిటీకి చెందిన అమన్‌దీప్‌సింగ్ ద్వితీయస్థానం సాధించారు.

మెరుస్తున్న క్రిస్మస్ స్టార్‌లు

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 16: లోకానికి వెలుగులు విరజిమ్మి, నవీన విప్లవానికి బాటవేసిన బాలయేసు ఆగమనాన్ని సూచిస్తూ, ఆయన రాకడను ఆహ్వానిస్తూ నగరం నలుమూలలా క్రైస్తవులు, విశ్వాసకులు భారీస్థాయిలో క్రిస్మస్ స్టార్‌లను ఏర్పాటుచేశారు. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ క్రిస్మస్ స్టార్‌లు మిలమిల మెరుస్తూ ఏసుక్రీస్తు త్వరలో లోకానికి వేంచేయనున్నాడని, ఆయన పుట్టుకను తెలియజేస్తున్నట్లుగా ఉన్నాయి. కాగా పెంతెకోస్త్‌లు, బాప్టిస్ట్‌లు, ప్రొటెష్టియన్, ఇవాంజిలిన్‌లు, క్యాతలిక్‌లు, ఆయా సంఘాల ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తున్నారు. శనివారం క్రిస్మస్ వాడలన్నింటిలోనూ, విద్యాసంస్థల్లో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గాయనీ గాయకులు బృంద గీతాలను ఆలపిస్తూ అందరికీ మనోహ్లాదం కల్గించారు. అన్ని ముఖ్య చర్చిలు, క్రైస్తవ ఆరాధనా మందిరాల్లో ఈ నెల 23, 24, 25 తేదీల్లోనూ, అలాగే జనవరి 1వ తేదీన క్రీస్తుజయంతి, నూతన సంవత్సర వేడుకలను వైభవంగా జరుపుకోవడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేశారు.