గుంటూరు

మెరుగైన సేవల్లో మంగళగిరి ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 16: పురపాలక సంఘం పరిధిలో ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా సేవలందించిన ఫలితంగా ప్రభుత్వ పరిశీలనలో పౌర సేవలందించడంలో మంగళగిరి మున్సిపాల్టీకి ప్రధమస్థానం లభించిందని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. పౌరసేవలందించడంలో పురపాలక సంఘానికి మొదటిస్థానం దక్కిన ఫలితంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందికి నిర్వహించిన అభినందన సభలో చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడారు. మొదటి స్థానం చేజారకుండా మరింత విస్తృతంగా సేవలందించాలని కోరారు. కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు, వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు, కౌన్సిల్ సభ్యులు మునగపాటి వెంకటేశ్వరరావు, బట్టు చిదానంద శాస్ర్తీ, డీఈఈ పి ఏడుకొండలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

ఇళ్ల ప్లాన్ల అనుమతుల్లో సమస్యలకు చెక్

గుంటూరు, డిసెంబర్ 16: నగరంలో ఆన్‌లైన్‌లో బిల్డింగ్ ప్లాన్ అప్రువల్స్‌లో సమస్యలు నగరపాలక సంస్థ నుండే ఎక్కువగా వస్తున్నాయని, ఇందుకు డి నెంబర్ మాస్టర్ ప్లాన్ నందు నమోదు కాకపోవడమే కారణమని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆన్‌లైన్ అప్రువల్‌లో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారం, అనధికార నిర్మాణాలు తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక, లైసెన్స్ టెక్నికల్ పర్సన్‌లతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ అనూరాధ మాట్లాడుతూ సిటీప్లాన్ పర్యవేక్షణలో ఒక్కో టీం ఒక్కో జోన్‌లో సర్వే నెంబర్లు (యుఎల్‌సి, పోరంబోకు) శాస్ర్తియంగా సబ్ డివిజన్లలో మాస్టర్ ప్లాన్ నందు పొందుపర్చాలని తెలిపారు. నగరంలో అనధికార హోర్డింగ్‌ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. అలాగే లైసెన్స్‌డ్ సర్వేయర్లు ప్లాన్‌లు సక్రమంగా అప్‌లోడ్ చేయాలని, అనధికార కట్టడాలను ప్రోత్సహించరాదని, అనధికార కట్టడాలను కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో సిపి చక్రపాణి, డిసిపి సత్యనారాయణ, ఎసిపిలు, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్‌లు, లైసెన్సు ఇంజనీర్లు పాల్గొన్నారు.