గుంటూరు

అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, డిసెంబర్ 16: రాష్టవ్య్రాప్తంగాఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శిశు, మహిళా సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం, కొల్లిపరలో ఏర్పాటుచేసిన పొదుపుసంఘ సభ్యుల శిక్షణా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హారైయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి సునీత మాట్లాడుతూ కొల్లిపర గ్రామ ముస్లిం కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకొంటున్న బాలుడు ఎస్‌కె చాంద్‌భాషా పాముకాటుకు గురై మృతి చెందటం విషాదకర సంఘటనగా పేర్కొన్నారు. ప్రస్తుతం పక్కా భవనాలులేని అంగన్‌వాడీ కేంద్రాలను తక్షణమే ప్రైవేటు అద్దె భవనాల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. నూతన భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ సుముఖంగా ఉందని త్వరలోనే అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు నూటికి నూరు శాతం పక్కా భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. మహిళలు ఆర్దిక స్వావలంభన దిశగా పయనించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని డ్వాక్రా మహిళలు అనతికాలంలోనే చేరుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేద మహిళలు కనీసం నెలకు 10వేల రూపాయలైనా స్వతంత్య్రంగా సంపాదించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. త్వరలోనే 575కోట్ల రూపాయలతో డ్వాక్రా మహిళలకు ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్దవౌతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి, మహిళాసంక్షేమ కార్యక్రమాల అమలును తెలుగు మహిళలు గమనించి ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించాలని విఙ్ఞప్తి చేశారు.