గుంటూరు

3.5 కోట్లతో పుష్కర పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 6: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతిలో ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల దృష్టా 3.5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు దేవాదాయశాఖ ఎస్‌ఇ ఎస్ సుబ్బారావు తెలిపారు. శుక్రవారం దేవాదాయశాఖ ఇంజనీర్ల బృందం స్థానికంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అమరేశ్వరస్వామి దేవస్థానానికి దక్షిణం వైపున నిర్మిస్తున్న రాజగోపురం పనులను పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ సుబ్బారావు విలేఖర్లతో మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల వ్యయంతో రాజగోపుర నిర్మాణం, అలాగే ఆలయ ప్రాంగణంలో పరిపాలనా భవనం, దేవాలయానికి పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ, మైనర్ రిపేర్లు, తాత్కాలిక అభిషేక మండప నిర్మాణం, సదావర్తిసత్రం, రామకృష్ణసత్రంలో వసతిగదుల నిర్మాణం, రామలింగేశ్వరస్వామి దేవస్థానం, మల్లేశ్వరస్వామి దేవస్థానం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ బృందానికి ఆలయ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి జరుగుతున్న పనుల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇఇ శ్రీనివాసరావు, పలు ఇంజనీర్లు పాల్గొన్నారు.