గుంటూరు

గుంటూరు రైల్వే డివిజన్‌లో ఎల్‌ఈడి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 18: దక్షిణ మధ్య రైల్వే విభాగం ఇంధన పొదుపు చర్యలపై దృష్టి సారించింది. ప్రధాన డివిజన్లలో సమీక్ష నిర్వహిస్తోంది.. ఇందులో భాగంగా గుంటూరు రైల్వే డివిజన్ నూరు శాతం పొదుపు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. డివిజన్ పరిధిలోని స్టేషన్లు, రైల్వే గేట్లు, లెవెల్ క్రాసింగ్ వద్ద పూర్తిస్థాయిలో ఎల్‌ఈడి బల్బులు ఏర్పాటు చేశారు. డివిజన్ పరిధిలోని 76 రైల్వే స్టేషన్లు, 184 రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్లు, 99 కార్యాలయ భవనాల్లో ఎల్‌ఈడీ వెలుగులు ప్రసరిస్తున్నాయి.. ఇంతకు ముందు కోటి రూపాయల వరకు విద్యుద్దీకరణకు ఖర్చుకాగా ఎల్‌ఈడీ బల్బుల వల్ల ఏడాదికి 5.8 లక్షల యూనిట్ల వినియోగంతో 52.5 లక్షల ఖర్చవుతుందని దీనివల్ల ఇంధన పొదుపుతో పాటు రెవిన్యూ కలసి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.