గుంటూరు

అరుపులు.. కేకలతో దద్దరిల్లిన సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జనవరి 19: వైసీపీ ఎంపీటీసీల అరుపులు.. కేకలతో చేబ్రోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం దద్దరిల్లింది. సమావేశాన్ని జరగనివ్వకుండా వైసీపీ ఎంపీటీసీలు అడ్డుకోవడంతో పాటు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. గత సమావేశంలో కూడా ఇదే విధంగా వైసీపీ ఎంపీటీసీలు అజెండా లేకుండానే సమావేశం నిర్వహిస్తున్నారని, సమావేశంలో తీర్మానాలను తాము ఆమోదించక పోయినప్పటికీ మినిట్స్ బుక్‌లో ఏకపక్షంగా రాసుకుంటున్నారంటూ ప్రతిపక్ష ఎంపీటీసీలు గత సమావేశంలో ఎంపీడీఒ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో కూడా వైసీపీ ఎంపీటీసీలు సమావేశం ప్రారంభం నుంచే గందరగోళాన్ని సృష్టించారు. ఎంపీపీ పోడియం వద్దకు వెళ్లి ప్రశ్నల వర్షం కురిపించడంతో సమావేశం అర్ధంతరంగా నిలిపివేశారు. చేబ్రోలు ఎంపీటీసీ బతుల్‌షేక్ మాట్లాడుతూ తనకు తెలియకుండానే తన వార్డులో రోడ్డు ఎవరు వేశారని ప్రశ్నించారు. గత సమావేశంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే పారిపోయారని ఎంపీపీ ఖాదర్‌బాషాపై ధ్వజమెత్తారు. సమావేశంలో అంశాలను తాము ఆమోదించక పోయినప్పటికీ ఏకపక్షంగా తీర్మానాలు చేసుకుంటూ మినిట్స్‌బుక్‌లో రాసుకుంటున్నారని, గత సమావేశానికి సంబంధించిన మినిట్స్ బుక్‌లో ఏం రాశారో తమకు చూపించాలని వైసీపీ ఎంపీటీసీలు పట్టుపట్టారు. ఇందుకు పంచాయతీరాజ్ మోషే స్పందిస్తూ చేబ్రోలు ఎంపీటీసీ బతుల్‌షేక్ వార్డులో వేసిన రోడ్డు మండల పరిషత్ నిధులతో వేసింది కాదని.. గ్యాప్ ఫిల్లింగ్ నిధులతో వేశామన్నారు. అలాగే ఇప్పటి వరకు మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, 14వ ఆర్ధిక సంఘం నిధులతోనే ఎక్కువ అభివృద్ధి పనులు జరిగాయని ఏఈ వివరించినప్పటికీ వైసీపీ ఎంపీటీసీలు సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు.

అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నా: ఎంపీపీ
మండల అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని ఎంపీపీ ఖాదర్‌బాషా అన్నారు. సమావేశాన్ని వైసీపీ ఎంపీటీసీలు బాయ్‌కాట్ చేసి వెళ్లిన అనంతరం ఎంపీపీ ఖాదర్‌బాషా విలేఖర్లతో మాట్లాడారు. తనపై దుష్ప్రచారం చేయటం కోసమే ఎంపీటీసీలు సమావేశంలో గందరగోళం సృష్టిస్తున్నారని అందరి సహకారం, భాగస్వామ్యంతో అభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తున్నా మన్నారు. మండల పరిషత్ నిధులు రూ 40లక్షలు అన్ని వార్డులకు సమానంగా కేటాయించడం జరిగిందని వివరించారు. సమావేశంలో వైసీపీ ఎంపీటీసీలు అడిగిన విధంగా మినిట్స్ బుక్‌ను చూపించటం జరిగిందన్నారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

తాడికొండ, జనవరి 19: ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. ఈ నెల 27న జొన్నలగడ్డలోని రాములోరి కల్యాణ మండపంలో రైతు పరిరక్షణ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని లాంగ్రామంలో పాటిబండ్ల వెంకటప్పయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాగ్దాలను విస్మరిస్తూ రాష్ట్రంలోని రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 50 వేల కోట్లతో పంటల గిట్టుబాటు ధర నిధిని ఏర్పాటు చేయాలన్నారు. స్వామి సాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో స్పైసెస్ బోర్డు ఉన్నప్పటికీ మిర్చి, పసుపు పంటలకు గిట్టుబాటు ధర లేక పోవడం ఏమిటని నిలదీశారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధర కల్పిస్తామని 2014లో మోదీ, చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కేరళ మాదిరిలా దేశ వ్యాప్తంగా ‘రుణ ఉపశమన కమిషన్ చట్టాన్ని’ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే లైన్ నిర్మాణానికి 28,500 ఎకరాలు భూమి ఎందుకని వడ్డే ప్రశ్నించారు. రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ మాట్లాడుతూ భవిషత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. లాం అగ్రి యూనివర్సిటీ పనులు వేగవంతం చేయాలని కోరారు.