గుంటూరు

నీటి సంఘాలదే సాగునీటి వ్యవస్థ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జనవరి 19: సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసుకుని అభివృద్ధి చేసుకునే బాధ్యత సాగునీటి సంఘాలపైనే ఉందని జలవనరులశాఖ ఈఈ బీ వెంకటస్వామి అన్నారు. మండల కేంద్రమైన అచ్చంపేటలోగల శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో శుక్రవారం జలవనరులశాఖ ఆధ్వర్యంలో సాగునీటి యాజమాన్య సదస్సులో సాగునీటి సంఘాల విధులు, బాధ్యతలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులందరికీ నీటిని సమంగా అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీరు దుర్వినియోగం కాకుండా నీటిపారుదల వ్యవస్థకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో చామర్రు డీసీ చైర్మన్ పొనె్నకంటి గోవిందరావును పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఈ పీ వీరయ్య, ఏఈ బాలకృష్ణ, సాగునీటి సంఘాల అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు, పీ శ్రీనివాసరావు, ఆర్ వీరాంజనేయులు, ఎం సూరయ్య, టి గంగయ్యతో పాటు విశే్వశ్వరరావు, ఆశీర్వాదం, ఎస్‌కె రసూల్, బీ సీతయ్య, చల్లా అనుపకళ తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా రాష్టస్థ్రాయి షటిల్ టోర్నీ

మంగళగిరి, జనవరి 19: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎంఎంకె ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న రాష్టస్థ్రాయి షటిల్ టోర్నమెంట్ శుక్రవారం రెండోరోజు ఉత్సాహ పూరిత వాతావరణంలో కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన 92 టీంలకు చెందిన క్రీడాకారులు టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల టీంలు ఫైనల్స్‌కు చేరుకున్నాయి. రెండు టీంల క్రీడాకారులను స్టేడియం ప్రతినిధి రావూరి రమేష్‌బాబు అభినందించారు. ఎఎంసి మాజీవైస్ చైర్మన్ మనె్నం రమేష్‌బాబు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మండ్రు రాము, స్టేడియం ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్ కొత్తపల్లి శ్రీనివాసరావు, వౌలాఖాన్, జంజనం వెంకట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. శనివారం జరిగే ఫైనల్ పోటీల అనంతరం విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.