గుంటూరు

సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జనవరి 20: సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ మహిళలు, పురుషుల పోటీలకు తెనాలి సిద్ధమైనట్లు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుండి 26 వరకు తెనాలిలో సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో తమిళనాడు, పాండిచ్చేరి, గోవా, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ పోటీల కోసం రెండు అవుట్‌డోర్ కోర్టులు సిద్ధం చేసినట్లు చెప్పారు. 24న రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభిస్తారని చెప్పారు. చివరిరోజు 26న రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారని వివరించారు. ఈ పోటీలను పురస్కరించుకుని మూడు రోజులు సాయంకాల సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ వివరించారు. ఇప్పటికే క్రీడా పోటీలకు అవసరమైన సౌకర్యాలు, మైదానం సిద్ధం చేశామని, తుది మెరుగులు ఆదివారం నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. అయితే గతంలో ఇదే స్టేడియంలో జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించామని అందుకు పట్టణ ప్రజలు, అధికారులు ఎంతో సహకరించారని, ఈ క్రమంలోనే సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ పోటీలకు కూడా సహకరించి విజయవంతం చేయాలని ఆలపాటి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు, కమిషనర్ కె శకుంతల, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, పీడీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.