గుంటూరు

పెదగొట్టిపాడు సందర్శన ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజార్), జనవరి 20: పెదగొట్టిపాడు దళితులపై హత్యాయత్నం దాడి అవమానమని ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యని, ఈ నెల 24వ తేదీన తలపెట్టిన ‘చలో గొట్టిపాడు’ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో నిర్వహించి తీరుతామని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక అరండల్‌పేటలోని విశ్వ బ్రాహ్మణ సమావేశ మందిరంలో వివిధ దళిత, ప్రజాసంఘాలు చలో గొట్టిపాడు పోరాట సంఘీభావ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి కృష్ణయ్య మాట్లాడుతూ నూతన సంవత్సరంనాడు అగ్రవర్ణాలు దళితులపై మూడుసార్లు దాడులుచేసి హత్యాయత్నానికి పాల్పడితే కేవలం ఒక కేసులో మాత్రమే 18 మంది నిందితులపై ఒకే కేసు నమోదు చేయటం దారుణమన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు కలెక్టర్, ఎస్పీలు ఆ గ్రామానికి వెళ్లి నిందితులతో బాధితులు రాజీచేసుకోవాలని బెదిరించారని ఆరోపించారు. రాజీ చేసుకోకుంటే కౌంటర్ కేసులు బనాయించి అరెస్టు చేస్తామనడం, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నేతలను ఆందోళన విరమించుకోవాలని బెదిరించడం ప్రభుత్వ అధికారుల దివాళాకోరు విధానాలకు అద్దం పడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్ది విల్సన్ మాట్లాడుతూ చట్టవ్యతిరేకంగా ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, ఎస్పీ, జిల్లా అధికారులు బాధితులను బలవంతపు బెదిరింపులతో నిందితులతో పంచాయతీలు, రచ్చబండ రాజీ కుదర్చటం హేయమన్నారు. పల్లెలో పోలీసు పికెటింగ్‌ను ఎత్తివేయాలని, నిందితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో సంఘీభావ కమిటీ కన్వీనర్ శాంతకుమార్, సీనియర్ న్యాయవాది వైకే, వీటీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు పాశం రామారావు, జంగాల అజయ్‌కుమార్, డీటీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వినయకుమార్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య, భీమసేన జిల్లా అధ్యక్షులు నల్లపు నీలాంబరం, బీసీ సంఘం నాయకులు వాసు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.