గుంటూరు

పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజార్), జనవరి 21: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైడీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలవుదినాలు, పండుగ రోజుల్లో కూడా కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారని, ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలన్నారు. నాలుగు గ్రేడ్లుగా కాకుండా రెండు గ్రేడ్లుగా కార్యదర్శులను కుదించాలన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పార్ట్‌టైం సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియారిటీ జాబితాలను తయారుచేసి అర్హులకు పదోన్నతులు కల్పించాలన్నారు. అధికమైన పనిభారం తగ్గించాలని, పండుగ రోజుల్లో విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ కమిషనర్, సంబంధిత మంత్రికి ఈనెల 22వ తేదీ సోమవారం సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఫిక్స్‌డ్ ట్రావెలింగ్ అలవెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు వర్తింప చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీయు రమణ, సంఘం జిల్లా అధ్యక్షులు జాన్ పీరా, ప్రధాన కార్యదర్శి సీఎస్‌ఈ జాన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రత్నం, నాయకులు కొల్లా శ్రీనివాసరావు, వెంకటాద్రి, గల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గొర్రెల మందపై దూసుకుపోయన లారీ

*16 జీవాలు మృతి

మేడికొండూరు, జనవరి 21: గుంటూరు- సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని కొర్రపాడు వద్ద గొర్రెల మందపై లారీ దూసుకు పోగా 16 జీవాలు మృతి చెందగా మరో 15 గొర్రెలు గాయపడిన సంఘటన ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నలుగురు గొర్రెల కాపరులు ఆ ప్రాంతంలో పసుగ్రాసం లేకపోవడంతో 200జీవాలతో వలస వస్తుండగా గుంటూరు నుండి సత్తెనపల్లి వెళుతున్న లారీ రోడ్డుపై వస్తున్న గొర్రెల మందపై దూసుకు పోయింది. ఈ సంఘటనలో 16 జీవాలు మృతిచెందగా మరో 15 గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గొర్రెల కాపరులు లబోదిబోమన్నారు. ఈ సంఘటన సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మేడికొండూరు సీఐ బిలాలుద్ధీన్ సంఘటన స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.